ఈరోజుల్లో కొందరు మహిళలు భర్త ఉండగానే వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంటారు. అందుకు కారణాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటిని సీక్రెట్ గా కొనసాగించడం తో పాటుగా దారునాలకు పాల్పడుతున్నారు. అడ్డుగా ఉన్న భర్తల ను చంపడానికి కూడా వెనుకాడరు. అక్రమ సంబంధాల మోజులో పడి పచ్చని సంసారాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు.. ఇప్పుడు జరిగిన ఓ ఘటన ఇలాంటి సంబంధాలు పెట్టుకున్న భార్యలకు బుద్ది చెప్థుంది.ప్రియుడితో రాసలీలలు చేస్తున్న భార్యను ఓ భర్త రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు.
ఇద్దరికీ తగిన బుద్ది చెప్పాడు. అతనికి మద్దతూగా గ్రామస్తులు కూడా నిలిచారు. తన ఆఫీస్ లో పనిచెస్తున్న వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు భర్త ఆరొపించారు.. వారిద్దరికి మద్దతూగా తన బావమరిది ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లొకి వెళితే.. వేరే వ్యక్తితో రాసలీలలు చేస్తున్న మహిళను తన భర్త రెడ్ హాండెడ్ గా పట్టుకున్న ఘటన కరీంనగర్ లో కలకలం రేపుతోంది.కరీంనగర్ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం చేస్తున్న సదరు మహిళ అదే డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్న తోటి ఉద్యోగితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.
కాగా, నగరంలోని భరత్ నగర్ లో మహిళ సోదరుడు ఇంట్లో మహిళ వుంటుంది.ఇంట్లో ఇద్దరు కలిసి ఉండగా భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఆమె ప్రియుడిని చెప్పుతో కొట్టగా... తీవ్రంగా గాయాలయ్యాయి. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో టైపిస్ట్ గా పనిచేస్తున్న ఉద్యోగి సదరు మహిళకు గతకొన్నేళ్లుగా అక్రమ సంబంధం నడుస్తోందని భర్త వాపోయాడు. తనకు ఆమెతో 2007 లో వివాహం జరిగిందని, వారికి ఇద్దరు పిల్లలున్నారని తెలిపాడు. బావమరిది సహాయం ఉండటం వల్లే తన భార్య రెచ్చిపోతుందని తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. బావమరిదికి తాను 15లక్షల రూపాయలు ఇచ్చానని, ఆ డబ్బులను తిరిగి అడిగి నందుకు భార్య, బావమరిది కలిసి తనపై అక్రమంగా కేసులు కూడా పెట్టారని బాధితుడు వెల్లడించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేశారు.