షాకింగ్ : 9వ తరగతి బాలికకు ప్రసవం?

praveen
దేశ నలుమూలలకు ఎక్కడికి వెళ్ళినా ఆడపిల్ల దుర్భర జీవితాన్ని గడుపుతుంది తప్ప ఎక్కడా ధైర్యంగా జీవితంలో ముందుకు సాగలేక పోతుంది. ఎందుకంటే నేటి రోజుల్లో మానవత్వం ఉన్న మనుషులు ఇక కామంతో ఊగిపోతూ మానవ మృగాలుగా మారిపోతున్నారు. దీంతో ఆడపిల్ల ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కామపు కోరల్లో చెప్పుకోకుండా ఉండేందుకు ఆడపిల్ల ఎంతలా ప్రయత్నించినప్పటికీ.. ఏదో ఒక విధంగా కామందులు ఆడపిల్లలపై అత్యాచారాలు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.


 ఇలా నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ఆడపిల్లల తల్లిదండ్రులకు కనీసం కంటిమీద కునుకు లేని దారుణమైన పరిస్థితి నెలకొంది అని చెప్పడంలో అతిశయోక్తి. చదువుకోడానికి ఉద్యోగం చేయడానికి వెళ్లిన తమ కూతురు క్షేమంగా ఇంటికి వస్తుందా లేదా అని తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. అలాంటి పరిస్థితులు నేటి సమాజంలో నెలకొన్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. బొబ్బిలి పట్టణంలో ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చదువుతున్న తొమ్మిదో తరగతి బాలిక మగబిడ్డకు జన్మనివ్వడం సంచలనంగా మారిపోయింది.


 దీనిపై గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ఆరా తీశారు. అయితే ఇక 9వ తరగతి విద్యార్థిని ప్రసవించే వరకు కూడా ఆమె కదలికలు శరీరాకృతిని పాఠశాల సిబ్బంది గుర్తించకపోవడం పై అనుమానాలు వ్యక్తమవుతు ఉండటం  గమనార్హం. అయితే బిడ్డ తో కలిపి ఆ సదరు బాలికను కొమరాడ మండలం లోని స్వగ్రామానికి పంపించినట్లు  ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని ఆశ్రమ పాఠశాల ఈడీ వద్ద ప్రస్తావించగా అలాంటిది ఏమీ లేదు అంటూ చెప్పడం గమనార్హం. ఇక ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది. తొమ్మిదవ తరగతి బాలిక గర్భం దాల్చడానికి కారణం ఎవరు అన్నదానిపై ప్రస్తుతం విచారణ జరుగుతుంది అని తెలుస్తోంది. 9వ తరగతి బాలిక ఆశ్రమ పాఠశాలలోనే ప్రసవించడం మాత్రం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: