మూడో భార్య పై అనుమానం.. భర్త ఏం చేసాడో తెలుసా?

praveen
అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే భార్యాభర్తల బంధం లో అనుమానం అనే పెనుభూతం దూరింది అంటే అనుకోని ఘటన జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక అనుమానం ద్వారా భార్య భర్తలు బద్ద శత్రువులు గా మారిపోయి చివరికి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడనీ పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇప్పటికే ఇలాంటి తరహా ఘటనలు ఎన్నో వెలుగులోకి రాగా.. ఇక్కడ జరిగిన ఘటన కూడా ఈ కోవలోకే వస్తుంది. మూడో భార్యపై అనుమానం పెంచుకున్న సదరు వ్యక్తి చివరికి భార్యను దారుణంగా హతమార్చిన ఘటన అందరిని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఘటన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.


 ఇటీవలే ఉదయం మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఈ దర్యాప్తులో భాగంగా అసలు మిస్టరీ వీడింది. భార్యపై అనుమానం తోనే భర్త దారుణంగా కొట్టి చంపాడు అన్న విషయం విచారణలో తేలింది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు యాదగిరి. అతనికి అప్పటికే పెళ్లయింది అయినప్పటికీ స్రవంతి అనే మహిళ ను రెండో పెళ్లి చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా ఇక రెండవ భార్య చెల్లి తో ప్రేమ వ్యవహారం నడిపించి గుడిలో పెళ్లి చేసుకున్నాడు.  స్రవంతి రేఖలది చెన్నై కాగా.. జీవనోపాధి నిమిత్తం నగరానికి వచ్చి ఉంటున్నారు.


 అయితే ప్రేమ అంటూ నాటకమాడిన యాదగిరి ఇక మూడో భార్య రేఖపై ఎప్పుడు అనుమానం తో వేధింపులకు గురి చేశాడు. ఇక ఇటీవలే నిర్మాణ పనులు నిలిచి పోయిన ఒక నాలుగు అంతస్తుల భవనం వైపుగా తన మూడో భార్య రేఖ ను తీసుకొని వచ్చాడు యాదగిరి. ఇద్దరూ కలిసి అక్కడ భోజనం చేశారు. ఈ క్రమంలోనే ఇష్టం వచ్చినట్టు తిరుగొద్దు అంటూ భార్యను హెచ్చరించాడు. ఆమె వినకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ అయింది. ఇక విచక్షణ కోల్పోయిన యాదగిరి దారుణంగా ఒక మూడో భార్యను కొట్టి చంపాడు అన్న విషయం పోలీస్ విచారణలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: