దేవుడా: ఇద్దరు టీచర్ల మధ్య ఎఫైర్.. ఆ తరువాత బ్లాక్ మెయిల్.. చివరికి..!!

N.ANJI
సమాజంలో విద్యార్థులను ఉన్నత విలువలతో తీర్చిదిద్దే పవిత్రమైన గురువు వృత్తిలో రాణిస్తున్నాడు ఓ ఉపాద్యాయుడు. ఓ మహిళ కూడా ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తుంది. వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడంతో ఓ బలహీన క్షణంలో ఆమెను లోబర్చుకొని ఆమె నగ్నఫోటోలు తీసి బెదిరించి బ్లాక్ మెయిల్ చేసిన సంఘటన విశాఖపట్నం జిల్లాలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖ జిల్లా రావికమతం మండలానికి చెందిన ఉపాధ్యాయుడు సూరెడ్డి మహేశ్వరరావు, పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన ఉపాధ్యాయిని గత ఏడాది విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో జరిగిన ట్రైనింగ్ సెషన్ కు పాల్గొన్నారు. అదే సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అయితే ఆ ఉపాధ్యాయినికి 2019లో పెళ్లవగా ఆమెను భర్త శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేశాడు. ఇక ఈ విషయాన్ని మహేశ్వరరావుతో చెప్పుకున్న ఉపాధ్యాయిని.. అతడు మాటలతో ఓదార్చడంతో ఇద్దరి మధ్య చనువు ఏర్పడింది.

అయితే ఆ చనువు కాస్తా వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి  దారి తీయడమే కాకుండా వీరిద్దరూ  తరచూ లాడ్జిలు, హోటళ్లలో శారీరకంగా కలుసుకుంటూ ఉండేవారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరూ ఓ రోజు లాడ్జిలో కలిశారు. ఇక ఆమె నిద్రిస్తుండగా సెల్ ఫోన్లో నగ్న వీడియోలు, ఫోటోలను చిత్రీకరించాడు. కాగా.. ఆ వీడియో, ఫోటోలను చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండేవాడు. అంతేకాదు.. అతడు చెప్పిన చోటుకు బాధితురాలు వెళ్తూ ఉండేది. ఇక అతడు ఆమె ఫోన్లో సీక్రెట్ యాప్ ఇన్ స్టాల్ చేసి దానిని కూడా కంట్రోల్ లోకి తీసుకోని ఆమెపై పూర్తిగా నిఘా పెట్టాడు.

చివరికి అతడితో విసిగిపోయిన బాధితురాలు విజయవాడలోని మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే విజయవాడలో అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. వియవాడకు చెందిన ఓ వ్యక్తి మరో మహిళపై అఘాయిత్యం చేస్తుండగా అతడి భార్య వీడియో తీసి బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేస్తూ పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: