కారు టైరు పగిలి ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి..!

MOHAN BABU
రోడ్డు ప్రమాదం ఎప్పుడు ఎలా ఏ విధంగా వస్తుందో ఎవరికీ తెలియదు. ఇలాంటి ప్రమాదాలు విధి వక్రిస్తే మరణాలు సంభవిస్తాయి. దేశంలో రోజు ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగి వేలమంది ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. కొన్ని రోడ్డు ప్రమాదాలు అనుకోకుండా సంభవిస్తాయి. కానీ కొన్ని రోడ్డు ప్రమాదాలు మన నిర్లక్ష్యం కారణంగానే సంభవిస్తాయి. అందులో ముఖ్యంగా మద్యం తాగి వాహనాలు నడపడం, మైనర్లు వాహనాలు నడపడం, ఇందులో మరీ ముఖ్యంగా ప్రతిరోజు మద్యం తాగి ఎక్కువ మంది యువత ఈ యొక్క ప్రమాదాలకు కారణం అవుతున్నారు. అయితే అనుకోకుండా కారు టైరు పగిలి రోడ్డు ప్రమాదం జరగడంతో ఇద్దరు మృతి చెందారు ఈ సంఘటన ఎక్కడ జరిగింది తెలుసుకుందామా..?

 తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలం లో గునగల్ గ్రామ సమీపంలో సాగర్ రహదారి మీద ఈ యొక్క రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తులు ఒక పెళ్ళికి హాజరై వారి ఇంటికి వస్తుండగా.. వారు ప్రయాణించే కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ యొక్క ప్రమాదంలో అందులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు మరణించగా ఇంకొక ఆరుగురికి తీవ్రమైన గాయాలు కూడా అయ్యాయి.ఆ క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలందిస్తున్నారు. ఈ యొక్క ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కూడా చేస్తున్నారు. మరణించిన వారు వట్టినాగులపల్లి కి చెందిన మాటూరి శ్రీకాంత్, తలపల్లి రామకృష్ణ లుగా గుర్తించారు.

 ఆ యొక్క కారు చాలా వేగంగా వెళుతుండటంతో దాని టైర్ లు పేలిపోయాయి. దీంతో ఆ ప్రమాదం చోటు చేసుకున్నట్టు పోలీసులు తెలియజేశారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న టువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఆ మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తరలించారు. వీరు హైదరాబాదులోని లింగంపల్లి నుంచి యాచారం మండలం లోని మాల్ లో జరిగిన  ఈ యొక్క వివాహానికి హాజరై తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: