ఊహించని ప్రమాదం.. ప్రయాణికులు ఆగ్రహం?

praveen
ప్రైవేట్ బస్సుల్లో కాదు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఎంతో క్షేమం.. నేటి రోజులలో జనాలు అనుకుంటున్న మాట. అంతే కాకుండా తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణం.  అందుకే ఎంతో మంది ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించడం కంటే రోడ్డు రవాణా సంస్థ ఏర్పాటు చేసిన బస్సు సర్వీసుల్లో ప్రయాణించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఇక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే  ప్రాణాలకు సేఫ్టీ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో  వెలుగులోకి వస్తున్న కొన్ని రోడ్డు ప్రమాదాలు మాత్రం అందరిలో భయాందోళన పెంచేస్తున్నాయి. కొన్ని కొన్ని సార్లు డ్రైవరు నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటే. మరికొన్ని సార్లు బస్సు కండిషన్ సరిగా లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయ్.

 ఏది ఏమైనా ఇలా వరుసగా జరుగుతున్న ఆర్టీసీ బస్సు ప్రమాదాలు మాత్రం అటు ప్రయాణికులు అందరిని కూడా భయపెట్టిస్తున్నాయి.  ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలంటే భయపడే పరిస్థితి తీసుకు వస్తున్నాయి. ఇటీవలే అనంతపురం జిల్లాలో ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులకు చావు తప్పి కన్ను లొట్ట పోయినంత పనైంది. తీవ్రగాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు ముగ్గురు ప్రయాణికులు. సింగనమల మండలం నుంచి శోధన పల్లి కి బస్సు వెళుతుంది. ఈ క్రమంలోనే ఓ మూల మలుపు దగ్గరికి రాగానే స్టీరింగ్ పని చేయలేదు. దీంతో బస్సు డ్రైవర్ బస్సును అదుపు చేయలేకపోయాడు.

 దీంతో ఒక్కసారిగా బస్సు బోల్తా పడింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉండడం గమనార్హం. ఒక్కసారిగా బస్సు బోల్తా పడడంతో ప్రయాణికులు ఆహా కారాలు  చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులు అందరిని  కూడా సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనలో డ్రైవర్ సహా మరో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం మాత్రం జరగలేదు.  ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే బస్సు మంచి కండిషన్ సరిగ్గా  లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. కాలం చెల్లిన బస్సులను నడిపి ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దు అంటూ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: