అమెరికాలో ఘోర అగ్ని ప్రమాదం.. ఎంత మంది మృతి చెందారంటే..!

MOHAN BABU
 అగ్రరాజ్యం అయినటువంటి అమెరికా దేశంలోని ఫిలడెల్ఫియాలో బుధవారం రోజున అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం ఎందుకు జరిగింది ఎలా జరిగిందో. ఏ సమయంలో జరిగిందో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళితే  అమెరికాలోని ఫిలడెల్ఫియాలో  బుధవారం నాడు అగ్ని ప్రమాదం జరిగి తీవ్రమైన మంటలు చెలరేగాయి. మూడంతస్తుల భవనంలో చెలరేగినటువంటి  మంటలు భవనం అంతా వ్యాపించడంతో  తీవ్రమైన నష్టంతో పాటు ఏడుగురు చిన్నారులు, 13 మంది సజీవంగా దహనం అయ్యారు. వీటితో పాటుగా మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఫిలడెల్ఫియాలోని ఫెయిర్ మౌంట్ అనే ప్రాంతంలో బుధవారం ఉదయం 6.40 గంటలకు అమెరికా సమయం ప్రకారం ఈ ఘటన జరిగిందని ఫిలడెల్ఫియాలోని పబ్లిక్ హౌస్ అథారిటీ సీఈవో అయిన కెల్విన్ జెర్మియా తెలియజేశారు.

భవనంలోని రెండవ అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అందులో నివాసం ఉంటున్నటువంటి ఫ్యామిలీకి బయటపడేందుకు వీలు పడలేదని, దాంతో భారీగా ప్రాణ నష్టం సంభవించిందని తెలియజేశారు. అయితే రెండవ అంతస్తులో సుమారు 18 మంది వరకు నివాసం ఉంటారని, ఇందులో ముగ్గురు  పనులకోసం  బయటకు వెళ్లారని తెలుస్తోంది. మిగిలిన 15 మందిలో మొత్తం 13 మంది ఈ యొక్క ప్రమాదంలో మృతి చెందారు. మరో ఇద్దరు మాత్రం తీవ్రమైనటువంటి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆ బాధితుల్లో  ఇద్దరి పరిస్థితి చాలా విషమంగా ఉన్నదని కెల్విన్ తెలియజేశారు.

 ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్నటువంటి  అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన జరిగిన స్థలానికి చేరుకొని గంటలోనే మంటలన్ని  ఆర్పివేసి అదుపులోకి తీసుకువచ్చారని  తెలియజేశారు. అయితే ప్రమాదం జరిగిన భవనంలో నాలుగు స్మోక్ డిటెక్టర్లు ఉన్నాగాని అందులో ఒకటి కూడా పని చేయలేదని  ఆయన అన్నారు. అయితే ఈ ప్రమాదం మాత్రం  ఎలా జరిగింది అనేది తెలియలేదని, దీనిపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ యొక్క ప్రమాదంలో ఇంత మంది మృతి చెందడం పట్ల  స్థానిక ప్రజలు విచారం వ్యక్తం చేశారు. అలాగే ఘటనపై మేయర్ జిమ్ కెన్ని దిగ్భ్రాంతి  తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: