ఇంతకంటే దారుణం ఉంటుందా.. కన్నతల్లిని బాత్ రూమ్ లోనే?

praveen
కాలం మారుతుంది మనిషి ఆలోచనా తీరులో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఒకప్పటిలా మూఢనమ్మకాలను పట్టుకుని వేలాడటం లేదు మనిషి. ఏది మంచి ఏది చెడు అని ఆలోచించుకో గలుగుతున్నాడు. ఎంతో విచక్షణ గా క్రమశిక్షణగా సభ్యసమాజంలో నడుచుకుంటున్నాడు. కానీ ఇప్పటికీ మారుతున్న కాలంలో కూడా ఎన్నో దారుణ ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎంతోమంది నేటి జనరేషన్ జనాలకు కనీ పెంచిన తల్లిదండ్రుల భారంగా మారిపోతున్నారు. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి బాధ్యతలను భుజాన వేసుకొని మోసి పెంచి పెద్ద చేసిన తండ్రి ఇద్దరూ వృద్ధాప్యంలో భాగంగా  మారిపోతున్నారు.

 ఒకప్పుడు తల్లిదండ్రులు చూపించిన ప్రేమ ఇక ఇప్పుడు పిల్లలకు చాదస్తంగా మారిపోతుంది. దీంతో ఇక తల్లిదండ్రులను ఓల్డ్ ఏజ్ హోమ్ లో వదిలేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. కని పెంచిన తల్లిదండ్రుల విషయంలో కాస్త అయినా జాలి దయ చూపించడం లేదు మనిషి నేటి రోజుల్లో . ఇవన్నీ చూస్తుంటే మారుతున్న కాలాన్ని బట్టి మనుషుల్లో కూడా మానవత్వం కనుమరుగైపోతుందా అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల కాలంలో ఎంతోమంది తల్లిదండ్రుల విషయంలో పిల్లలు వ్యవహరిస్తున్న తీరు సభ్యసమాజం తలదించుకునేలా చేస్తోంది..

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. నవమాసాలు మోసిన తల్లి కి కాస్తయినా ఆశ్రయాన్ని లేక పోయాడు ఆ కొడుకు. చివరికి తల్లిని  ఒక బాత్ రూమ్ లో బంధించాడు. ఘటన మెదక్ జిల్లా శివం పేట  మండలం తిమ్మాపూర్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. వీరాస్వామి అనే వ్యక్తి తన తల్లి రామవ్వను బాత్ రూమ్ లోనే ఉంచినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయంపై న్యాయవాది స్వరూప జడ్జి హరిత స్పందించి వీరస్వామి ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.తల్లిని సరిగా చూసుకోకపోతే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక ఆ తర్వాత బుద్ధి తెచ్చుకున్న కొడుకు తల్లి బాత్రూంలో నుండి ఇంట్లోకి తీసుకువచ్చి ఆశ్రయం కల్పించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: