బ్యాంక్ లాకర్‌లో `మరకత లింగం`.. విలువ తెలిస్తే షాకే..!
దీని విలువను పురావస్తు శాఖ వారి రూ.500 కోట్లు ఉంటుందని అంచనా వేయగా.. ఈ విగ్రహం చోళుల కాలం నాటిదిగా గుర్తించారు. ప్రస్తుతానికి ఈ శివలింగం తమ ఆధీనంలో ఉందని చైన్నై పోలీసులు వెల్లడించారు. అయితే, నిందుతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి దగ్గరకు పురాతన మరకత లింగం ఎలా వచ్చిందనే దానిపై విచారణ చేపట్టినట్టు పేర్కొన్నారు. తంజావూర్‌లోని అరళనందనగర్ లో ఉండే సామియపన్ ఇంట్లో పురాతన శివలింగాలు ఉన్నాయన్న సమాచారం మేరకు పోలీసులు డిసెంబర్ 30 న సోదాలు నిర్వహించారు. అనంతరం సామియపన్ కుమారుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ... మరకతలింగం గురించి ఆసక్తికర విషయాలు వివరించారు.
తన తండ్రి బ్యాంక్ లాకర్ లో ఓ పురాతన శివలింగాన్ని ఉంచినట్లు తెలపడంతో వెంటనే పోలీసులు ఆ లింగాన్ని స్వాధీనం చేసుకున్నారు. జియోలాజికల్ అధికారులు వివిధ పరీక్షలు చేశారు. ఇకపోతే దానికి సంబంధించిన ధృవపత్రాల గురించి ఆరాదీసినా వాటిని సమర్పించకపోవడంతో సీజ్ చేశారు. అసలు వారికి ఈ మరకత శివలింగం ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే, 2016లో నాగపట్టణంలో ఓ శివలింగం చోరికి గురవడంతో.. అది ఇదీ ఒక్కటా కాదా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. దీంతో పాటు చోళుల కాలం నాటి మరకత లింగం స్వామియపన్ చెంతకు ఎలా చేరిందనే విషయంపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక బృందాలు ఇప్పటికే దర్యాప్తు మొదలుట్టాయి.