ఛీ.. వీడు ప్రియుడే కాదు.. ప్రియురాలి సంతోషాన్ని తట్టుకోలేక?
ఇలా ఇటీవలి కాలంలో ప్రేమ కారణంగా పోతున్న ప్రాణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.. నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు లేకుండా అస్సలు ఉండలేను అంటూ ఒక వ్యక్తి ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటాను అంటూ మనుషులు యువతిని లోబర్చుకుని శారీరక అవసరాలు తీర్చుకున్నాడు. ఆ తర్వాత ప్రియుడు గురించి అసలు విషయం బయటపడింది. అతనికి ఆల్రెడీ పెళ్ళై ఒక కూతురు కూడా ఉంది. ఇది తెలిసినప్పటికీ ఆ యువతి ఎంతో ధైర్యంగా ప్రియుడికి దూరంగా ఉండడం మొదలు పెట్టింది.
అన్నీ మరిచిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని అనుకుంది. తల్లిదండ్రులు ఆ యువతికి వేరే వ్యక్తితో పెళ్లి ఫిక్స్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు మళ్ళీ ఆ యువతిని వేధించడం మొదలు పెట్టాడు. వేధింపులు భరించలేక పోయిన సదరు యువతి మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు తీసుకుంది. ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో వెలుగులోకి వచ్చింది. 19 ఏళ్ల కవిత అనే యువతిని ప్రేమ పేరుతో దగ్గరై ఆ తర్వాత లోబరుచుకుని శారీరక అవసరాలు తీర్చుకున్నాడు ప్రవీణ్ అనే యువకుడు. అంతలోనే అతనికి పెళ్ళైన విషయం బయటపడింది.. దీంతో కవిత వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అవ్వగా.. మళ్ళీ వేధించడం మొదలుపెట్టాడు ప్రవీణ్. దీంతో మనస్తాపం చెందిన కవిత చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.