మద్యం కల్తీ: ఏం కలుపుతున్నారో తెలిస్తే షాకే..!

MOHAN BABU
రాష్ట్రంలో కొన్ని ముఠాలు కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తున్నాయి. ప్రాణం తీసే కెమికల్స్ తో మందుకు మిక్స్ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఎక్స్పర్టులను పెట్టుకొని మరీ దందా చేస్తున్నాయి. వేరే రాష్ట్రాల నుంచి సీసాలు, మూతలను తెప్పించి కల్తీ లిక్కర్  వ్యాపారంతో సొమ్ము చేసుకుంటున్నాయి. అమ్మే దాంట్లో 30 శాతం తక్కువ కాకుండా కల్తీ మద్యాన్ని జనానికి అంటగడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్జిన్లు తగ్గించడంతో.. దాన్ని పూడ్చుకునేందుకు వ్యాపారులు అడ్డదారులు తొక్కారన్న వాదనలు వినిపిస్తున్నాయి.


 అడ్డుకుని ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన అబ్కారి అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్ సిటీ తో పాటు చాలా జిల్లాలోని షాపుల్లో కల్తీ మద్యం దందా నడుస్తుంది. ఊర్లలో ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారని తెలుస్తోంది. నీటిలో మరగబెట్టి అందులో కెమికల్,క్లీనింగ్ ఫ్లూయిడ్స్, నెయిల్ పాలిష్ రిమూవర్, కార్లను తుడవడానికి వాడే క్రీములు వంటి వాటిని కలిపి మిక్స్ చేస్తున్నారు. కొద్దిగా తాగినా ఎక్కువగా కిక్కు వచ్చేందుకు వివిధ రకాల పదార్థాలను కలుపుతున్నారు. ప్లాస్టిక్ బాటిల్ లో దొరికే ప్రీమియం బ్రాండ్ల నుంచి మందు తీసి కల్తీకి పాల్పడుతున్నారు. బాటిల్ మూత సీల్ పోకుండా టెక్నిక్ తో తీసి అందులోని అసలు సరుకును తీస్తున్నారు.తీసిన దాన్ని మరో బాటిల్లో పోసి కల్తీ చేస్తున్నారు. అనుమానం రాకుండా మూతలను పెడుతున్నారు. బీర్ లలోనూ కల్తీ  జరుగుతోంది.


చక్కెర తో పాటు వివిధ కెమికల్స్ కలిపిన నీటికీ షాంపూ పౌడర్, కుంకుడుకాయ రసం కలిపి బాటిళ్ళలో పోస్తున్నారు. దానికి నిమ్మరసం బండ్ల పై వాడే సోడాను పోసి మూతలుపెట్టేసి అమ్ముతున్నారు. బార్ల లోనూ ఇదే దందా సాగుతోంది. ఆర్డర్ చేసిన బ్రాండ్ నే మొదట సర్వ్ చేస్తారు. రెండు పెగ్గులు పోసాక అదును చూసి కల్తీ మందు సరఫరా చేస్తున్నారు. కల్తీ కోసం ప్రత్యేకంగా ఎక్సపర్ట్ లను పెట్టుకుంటున్నారు. పాపులర్ బ్రాండ్ ఫుల్, హాఫ్ బాటిళ్ళ మూతను సీల్ ఊడకుండా తీసి.. మందును వేరే సీసాలోకి ఒంపి..నీళ్లు లేదా కెమికల్స్ కలుపుతూ దందా నడుపుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: