బాలుడి కామం.. బాలిక గర్భం.. చివరికి?
ఇలా అశ్లీల వీడియోలు చూస్తూ ఇంకా ఎంతోమంది అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. తెలిసి తెలియని వయసులోనే అత్యాచారాలకు పాల్పడుతు ఏకంగా జైలుపాలు అవుతున్నారు ఎంతోమంది విద్యార్థులు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.. అతని వయసు 17 ఏళ్లు. చక్కగా కాలేజీకి వెళ్లి చదువుకోవాల్సిన అతనిలో కామ కోరికలు పుట్టాయి. చివరికి వెనకా ముందు ఆలోచించకుండానే మంచి తేడా తెలియని ఆ 17 ఏళ్ల బాలుడు 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదంతా జరగడానికి స్మార్ట్ఫోన్ యుగం కారణమా లేకపోతే.. ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి.
చివరికి 17 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడడంతో పదిహేనేళ్ల బాలిక గర్భం దాల్చింది. ఏపీ లోని తాజంగి లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. బోయ పాడు గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన బాలుడు గర్భవతిని చేశాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అరెస్టు చేశారు. బాలిక తొమ్మిదో తరగతి చదువుతుండగా.. 17 ఏళ్ల బాలుడు ఇంటర్ పూర్తిచేసి గ్రామంలోనే ఉంటున్నాడు. వీరి మధ్య ప్రేమ చిగురించింది. చివరికి శారీరకంగా కూడా కలుసుకున్నారు. దీంతో బాలిక గర్భం దాల్చింది. బాలిక ప్రవర్తనలో అనుమానం వచ్చినా కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించి గర్భవతి అని నిర్ధారణ అయింది.. దీంతో తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అరెస్టు చేసి జువైనల్ హోంకు తరలించారు.