కోతుల ప్రతీకారం.. 250 కుక్కలను చంపేసాయ్?
సాధారణంగా కుక్కలను చూస్తే కోతులు భయంతో పరుగులు పెడుతూ ఉంటాయి అన్న విషయం అందరికి తెలిసిందే.. అందుకే రైతులు పొలాల్లోకి వచ్చిన కోతులను తరిమికొట్టెందుకు ఎక్కువగా కుక్కలను వాటిపైకి ఎగవేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక కుక్కలు వెంట పడగానే కోతులు పరుగో పరుగు అంటూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. కోతులు కుక్కలను వెంటాడి వేటాడి మరీ చంపుతూ ఉండటం గమనార్హం.
ఒకటి కాదు రెండు కాదు రెండు వందల యాభై కుక్కల ప్రాణాలు తీశాయి కోతులు.
ఈ ఘటన కాస్త గ్రామస్తులు అందరినీ ఎంతగానో ఆందోళనకు గురిచేస్తోంది.. గ్రామస్తులు కోతుల బెడద కారణం గా అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన అధి కారులు మాత్రం కోతులను కూడా పట్టుకోలేకపోయారు అని గ్రామస్తులు చెబుతున్నారు. కోతులు పగ తీర్చుకుంటున్నాయి అంటూ కొంత మంది గ్రామస్తులు చెబుతున్నారు. కొన్ని కుక్కపిల్లలు ఒక కోతిని చంపడంతో ఇదంతా ప్రారంభమైంది అంటూ చెబుతున్నారు. కోతులు ఆ ప్రాంతంలో భయంకరంగ కుక్కలను చంపుతూ పగ తీర్చుకుంటున్నాయి అని అంటున్నారు గ్రామస్తులు.. అయితే గ్రామంలో కోతుల బెడద రోజురోజుకూ పెరిగిపోతోందని గ్రామస్తులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కోతుల బెడద నుండి తప్పించాలి అంటూ కోరుతున్నారు.