మైనర్ కోడలుపై కన్నేసిన మామ.. ఆపై గర్భం..!

MOHAN BABU
ప్రస్తుత సమాజంలో వావివరుసలు మరుస్తున్నారు. మన అనే బంధుత్వాలు లేకుండా పోతున్నాయి. రక్త సంబంధీకులపైనే పాశవికంగా దాడులు చేస్తూ  అఘాయిత్యాలకు  పాల్పడుతున్నారు. చెల్లి, తల్లి, కూతురు, కోడలు అనే బంధు ప్రేమ లేకుండా క్షణికావేశంలో ఇలాంటి ఘటనలకు పాల్పడుతూ కటకటాల పాలవుతున్నారు. అలాంటి ఒక సొంత అక్క కూతురు పైనే మామ కన్నేశాడు. ఏడు నెలలుగా ఆమెపై లైంగికదాడి చేశాడు. దీంతో ఆ మైనర్ బాలిక గర్భం దాల్చింది. మరి ఈ దారుణం ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం..!


పూర్తి వివరాల్లోకి వెళితే హైదరాబాద్ శివారు ప్రాంతమైన జల్ పల్లి చెందినటువంటి ఒక మహిళకు ఇద్దరు మైనర్ కూతుళ్ళ తో పాటు ఒక కొడుకు ఉన్నాడు. అయితే ఆమె భర్త విపరీతంగా తాగుడుకు బానిసై  పది సంవత్సరాల క్రితమే మరణించాడు. దీంతో ఆ సదరు మహిళ ఆమె పిల్లలతో పాటు గా వారి యొక్క తల్లి గారి ఇంట్లో నివాసముంటోంది. అక్కడే ఉండి కూలిపని చేసుకుంటూ తన పిల్లలను పోషించుకుంటూ ఉంది. ఈ క్రమంలోనే ఆమె సోదరులు కూడా ఇంట్లోనే ఉంటారు. అయితే ఆమె ఒక పెద్ద కుమార్తెపై సొంత సోదరుడే కన్నేసి గత ఏడు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. దీంతో సదరు బాలిక గర్భం దాల్చింది. అయితే ఆ మైనర్ బాలిక శరీరంలో మార్పులు కనిపించడంతో  ఆమె తల్లి ఏం జరిగింది అని నిలదీసింది. దీంతో ఈ విషయం చెప్పేసింది. సొంత సోదరుడు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డ డంతో అక్క బోరున విలపించింది.


అయితే అమ్మాయి అప్పటికే గర్భం దాల్చడం వల్ల ఆ బాలిక అమ్మమ్మ మరియు నిందితుడు కలిసి అబార్షన్ చేయించారు. తర్వాత వారిని ఇంటి నుంచి తరిమేశారు. దీంతో ఆ తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు అంతంత మాత్రంగానే స్పందించడంతో  స్థానిక నేతలతో కలిసి న్యాయం చేయాలని కోరింది. దీంతో విషయం కాస్త  రాచకొండ పోలీస్ కమిషనర్ కు స్థానిక నేతలు తెలియజేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుని కోసం వెతక తయారు. కానీ నిందితుడు అప్పటికే పరారీలో ఉన్నట్లు  తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: