తల్లి కాదు రాక్షసి.. రెండు నెలల పసిగుడ్డును?
పేగు బంధాన్ని సైతం మరిచి అభం శుభం తెలియని శిశువుల ప్రాణాలు తీస్తున్నారు ఎంతోమంది. ఇక్కడ ఓ కసాయి తల్లి ఇలాంటి పని చేసింది. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చింది ఆ తల్లి కానీ ఆ బిడ్డ మొఖం చూసి మాత్రం ఆ తల్లి అసహ్యించుకుంది. ఎందుకంటే కొడుకు పుడతాడు అని భావించిన ఆ తల్లికి బిడ్డ పుట్టడంతో అస్సలు నచ్చలేదు. దీంతో ఇక పేగు తెంచుకుని పుట్టిన బంధాన్ని సైతం మర్చిపోయింది. ముక్కు పచ్చలారని ఆ శిశువు విషయంలో ఆ తల్లి ఎంతో కర్కశంగా ప్రవర్తించింది. రెండు రోజుల వయసున్న ఆ చిన్నారిని పురిట్లోనే చిదిమేసింది ఆ తల్లి.
సభ్య సమాజం సిగ్గుపడే ఈ ఘటన గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెలలోకి వెలుగులోకి వచ్చింది. రెండు నెలల పసి కందును కనీసం జాలి దయ లేకుండా చంపేసింది తల్లి.. బొంతు లక్ష్మి అనే మహిళ కు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు ఉన్నాడు. మరోసారి మగపిల్లాడు పుట్టాలి అనే ఆలోచనతో గర్భం దాల్చింది ఆ మహిళ. కానీ ఇటీవలే ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆడపిల్ల పుట్టిందని రక్తం పంచుకుని పుట్టిన బిడ్డను అసహ్యించుకుంది ఆ తల్లి. నోట్లో వేలు పెట్టి ఊపిరాడకుండా చేసింది చివరికి ఆ తల్లి కళ్ళల్లోకి దీనంగా చూస్తూ ఏమీ తెలియని ఆ పసిగుడ్డు ప్రాణాలు వదిలింది. తర్వాత ఏమీ తెలియనట్లు ఆసుపత్రికి తీసుకెళ్ళింది. అనుమానం వచ్చిన వైద్యులు నిలదీయడంతో అసలు విషయం ఒప్పుకుంది.