ఆ బాలికల గురుకులంలో మందు కలకలం.. వీరే తాగారా..!

MOHAN BABU
 అదొక పవిత్ర గురుకులం పాఠశాల. దానికి తోడు బాలికలు విద్యనభ్యసిస్తున్న విద్యాలయం. అది బాలికల విద్యాలయం కాబట్టి సంబంధంలేని ఏ వ్యక్తి అందులోకి ప్రవేశించడానికి వీలు లేదు. ఇందులో విద్యనభ్యసిస్తున్న బాలికల తల్లిదండ్రులు, బంధువులనే సవాలక్ష ప్రశ్నలు అడిగి కేటాయించిన టైంలోనే వారిని కలవడానికి అనుమతి ఇస్తారు. అలాంటి బాలికల గురుకుల పాఠశాల కోసం తన బిల్డింగ్ కిరాయి ఇచ్చినందుకు పాఠశాలపైన ఒక విలాసవంతమైన గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకొని తానా, తందానా అంటూ మద్యం పార్టీ చేసుకుంటూ బిల్డింగ్ యజమాని ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయం పక్కన ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే సంక్షేమ గురుకుల పాఠశాల ఉంది. అయితే ఈ పాఠశాల కోసం బిల్డింగ్ మధ్య ఇచ్చినటువంటి యజమాని తన స్నేహితులతో తరచూ మద్యం పార్టీలకు, విందులు చేసుకుంటారు. ఈ సందర్భంలోనే మద్యం పార్టీకి హాజరైన ఒక వ్యక్తి అక్కడే ఉన్న విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించడంతో  ఆ బాలిక తల్లిదండ్రులను చితకబాదారు. దీనిపై కేసు కూడా నమోదైంది. ఈ ఘటన బయటకు పొక్కడంతో విద్యార్థుల తల్లిదండ్రులు  ఆందోళన చెందుతున్నారు. ఈ గురుకుల పాఠశాల యొక్క ప్రిన్సిపాల్  ఆ బిల్డింగ్ యజమాని మంచి స్నేహితులుగా ఉంటారని  దీని ద్వారా వారు ఏం చేసినా ఆయన పట్టించుకోవడం లేదని, ఏదైనా అపాయం  జరిగితేగానీ చర్యలు తీసుకోరా అని,  పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలకు భద్రత లేకుండా పోతోంది. రోజుకు కొన్ని వేల అఘాయిత్యాలు ఆడ పిల్లలపై జరుగుతున్నది మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి పవిత్రమైన విద్యాలయంలో ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరం. వెంటనే ఈ దుశ్చర్యను ఆపివేయాలని పలువురు తల్లిదండ్రులు కోరుతున్నారు.  అయితే దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: