బావమరిదిపై ప్రేమ.. ప్రాణాలు వదిలిన బావ?
అయితే ఇప్పటివరకూ ప్రేమించిన వారు మోసం చేశారన్న కారణంతో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి.. అంతేకాదు పరీక్షల్లో పాస్ కాలేకపోయాము అన్న కారణంతో కూడా ఎంతో మంది యువత క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ ఇక్కడమనం మాట్లాడుకునేది మాత్రం ఇప్పటివరకూ కనీవినీ ఎరుగనిది అనే చెప్పాలి. ఏకంగా బావమరిది మీద ప్రేమతో బావా బలవన్మరణానికి పాల్పడ్డాడు.. ఈ ఘటన రెండు కుటుంబాల్లో కూడా తీవ్ర విషాదాన్ని నింపింది. మెదక్ జిల్లాలోని తూప్రాన్ మండలంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది
జెండా పల్లి గ్రామానికి చెందిన శంకర్ నర్సమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చిన్న కొడుకు ప్రశాంత్ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయం చూసుకుంటున్నాడు. అయితే ఇతనికి శివంపేట మండలానికి చెందిన బామ్మర్ది శ్రీశైలం అంటే ఎంతో ఇష్టం. ఇక వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. అయితే ఇటీవల శ్రీశైలం అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే శ్రీశైలం కు ఎంతో సన్నిహితుడైన బావ ప్రశాంత్ ఇక ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఎంతో మనో వేదనకు గురయ్యాడు. ఇక అయితే విషయాన్ని మనసులో పెట్టుకొని కుంగిపోతూ ఉండేవాడు. ఓ రోజు కఠిన నిర్ణయం తీసుకున్నాడు. పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.