కష్టపడి చోరీ చేసి.. నగదు టాయిలెట్ లో వేసాడు.. చివరికి?
ఇక ఆ తర్వాత పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరగడం లాంటివి సినిమాల్లో చూస్తూ ఉంటాము.. అప్పుడప్పుడు నిజజీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఇటీవల కాలంలో దొంగలు రూటు మార్చారు రహస్యంగా ఇంట్లోకి చొరబడి దొంగతనాలకు పాల్పడటం కాదు ఏకంగా పని మనుషులుగా చేరి నమ్మకస్తుడిగా మారిన తర్వాత చేతివాటం చూపించడం మొదలు పెడుతున్నారు ఎంతోమంది. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అని ఒక సామెత ఉంది కదా.. అదే సామెత ఫాలో అవుతున్నారు ప్రస్తుతం దొంగలు. ఇక్కడ ఇలాంటి ఒక దొంగ వ్యవహారం కాస్త బయటపడి హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇంట్లో పని కోసం వచ్చిన ఓ యువకుడు నగదు మాయం చేసాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని ఇంటి యజమాని గుర్తించాడు. దీంతో భయపడి తన జేబులో ఉన్న దాదాపు 2.5 లక్షల నగదును టాయిలెట్లు వేసి చేతులు దులిపేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. రోడ్ నెంబర్ 18 లో నివసించే ప్రముఖ వ్యాపారి ప్రకాష్ చందు జైన్ నివాసం లో దీపావళి పూజలు నిర్వహించారు. ఈ క్రమంలోనే 18 సభ్యులతో భోజన క్యాటరింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇంతలో పూజ వద్ద 3.25 లక్షల నగదు కనిపించలేదు. డబ్బు కాజేసిన కేటరింగ్ సిబ్బందిలో ఒక్కరైనా షేక్ రజాక్ 75వేలు యంత్రం కింద పడేసాడు. మరో 2.5 లక్షల ఎక్కడ దాచాలో తెలియక బాత్రూం లో వేసి ఫ్లష్ కొట్టాడు. మొత్తం లోపలికి వెళ్లగా 3, 4 నోట్లు తేలుతూ కనిపించింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు విచారించగా అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు షేక్ చంద్ రజాక్ .