గర్ల్ ఫ్రెండ్ పొట్టిగా ఉందని నరికేశాడు.. చివరికి?

praveen
సభ్య సమాజంలో బ్రతుకుతున్నది మనుషులా.. లేక మనుషులు రూపంలో ఉన్న మానవ మృగాల.. ఏమో మరి ఈ రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే అందరిలో ఇదే అనుమానం కలుగుతోంది. మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనిషిలో ఆ మానవత్వమే కనిపించడం లేదు నేటి రోజుల్లో. చిన్న చిన్న విషయాలకే ఎంతో కఠినాత్ముడు గా మారిపోతున్న మనిషి సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా కాస్తయినా ఆలోచన చేయడం లేదు. ఏకంగా హత్యలకు పాల్పడి జైలుకు వెళ్లి శిక్ష అనుభవించాల్సి వస్తుంది అన్న భయం కూడా ఎవరి లో కనిపించడం లేదు.


 రోజు రోజుకి మనుషుల్లో మానవత్వం కరువైపోయింది. దారుణంగా హత్యకు పాల్పడేందుకు సిద్ధమవుతున్నారు. చిన్నచిన్న కారణాలకే ఉన్మాదులు గా మారిపోతున్న మనుషులు పరాయి వ్యక్తుల విషయంలోనే కాదు సొంత వారి విషయంలో కూడా కాస్త జాలి దయ చూపించడం లేదు అన్నది అర్థమవుతుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. సాధారణంగా ప్రేమించిన యువతిపై ఎంతో కేరింగ్ తీసు కుంటూ ఉంటాడు ప్రియుడు. ఏ కష్టం రాకుండా చూసు కుంటాడు. అంతేకాదు పెళ్లయిన తర్వాత.. నీకు భరోసా గా ఉంటాను అన్న విషయం అర్థం అయ్యే విధంగా తన ప్రేమను చూపిస్తూ ఉంటాడు.


 ఎప్పటికప్పుడు ప్రియురాలికి బహుమతులు ఇస్తూ సర్ప్రైజ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం చిన్న కారణానికి దారుణంగా వ్యవహరించాడు. ప్రియురాలు పొట్టిగా ఉంది అనే కారణంతో దారుణంగా నరికేసాడు ఇక్కడ ప్రియుడు. ఈ ఘటన జార్ఖండ్లో వెలుగులోకి వచ్చింది. అజిత్ అంజలి  అనే యువతీయువకులు ప్రేమించుకున్నారు. అయితే ఆ అమ్మాయి పొట్టిగా ఉంది.. ఆమె ని ఎలా లవ్ చేసావ్ అంటూ అజిత్ ను స్నేహితులు హేళన చేయడం మొదలుపెట్టారు. దీంతో అప్పటి వరకు అంజలిపై ఉన్న ప్రేమ కాస్త పగగా  మారిపోయింది. ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ చేసాడు. ఇక పెళ్లి చేసుకుందాం అంటూ నమ్మించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గొడ్డలితో నరికి చంపాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారణ చేపట్టగా ఇక ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: