విమానంలో వచ్చి.. ఇదేం పాడు పనో?

praveen
ఇటీవలి కాలంలో దొంగలు ఎక్కడ చూసినా రెచ్చిపోతున్నారు. దోపిడీలకు పాల్పడేందుకు వినూత్నమైన దారులు వెతుకుతున్నారు. ఏకంగా పోలీసులకు సవాల్ విసిరే విధంగా సరికొత్తగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. అంతేకాదు ఇక ఎలాంటి ఆచూకీ కూడా దొరక్కుండా ఎంతో జాగ్రత్త పడుతున్నారు నేటి రోజుల్లో దొంగలు   ఇలా ఎంతోమంది దొంగతనాలకు పాల్పడుతూ అందినకాడికి దోచుకోపోతున్న  ఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు అందరూ చాలా మంది దొంగల గురించి వినే ఉంటారు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకునేది మాత్రం చాలా కాస్ట్లీ దొంగల గురించి.

 చేసేది దోపిడీలు అయినప్పటికీ ఎంతో ప్రొఫెషనల్గా ఉంటారు. ఏకంగా విమానాల్లో వచ్చి దొంగతనాలు చేస్తూ అందినకాడికి దోచుకో పోతూ ఉంటారు  అయితే ఇళ్లల్లో దోపిడీలు చేయడం కాదు కాదు ఎక్కువగా డబ్బులు ఉండే ఏటీఎం సెంటర్ లే వీరి టార్గెట్. ఇలా గత కొంత కాలం నుంచి ఏటీఎం చోరీలకు పాల్పడుతున్న ముఠా ను ఇటీవల నిజాంబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని ఎస్బిఐ ఏటీఎంలోఈనెల 16వ తేదీన ఒక లావా దేవి జరిగింది. ఈ విషయాన్ని అటు అధికారులు సిసి కెమెరాల ద్వారా గుర్తించి బ్యాంక్ మేనేజర్ కు సమాచారం అందించారు. ఆయన ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇక రంగంలోకి దిగిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు.

 డిజిటల్ కీ సహాయంతో 30 వేల రూపాయల నగదును విత్డ్రా చేసుకుని అక్కడి నుంచి పరారయ్యారు పోలీసులు. సీసీ కెమెరాలను గుర్తించారు. ఈ క్రమంలోనే ఈ కేసును ఎంతో సవాల్గా తీసుకున్నారు పోలీసులు. ఇక ఇటీవలే రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ఒక లాడ్జ్ లో ఇద్దరు నిందితులు కూడా బస చేస్తున్నట్లు సమాచారం అందుకుని హుటాహుటిన అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు  వారి దగ్గర నుంచి 30 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతే కాదు రెండు ఏటీఎం మానిటర్ డిజిటల్ కీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. హరియాణా కు చెందిన షాకీర్, అల్తాఫ్, షకీల్ అహ్మద్,అమీర్, సోహెల్, ఆశిక్, ఇన్ సాబ్ ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు విచారణలో తేలింది. ఒక రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుని ఆ తర్వాత విమానంలో అక్కడికి వెళ్లి ఇక ఎవరికి తెలియకుండా దోపిడీకి పాల్పడి అక్కడినుంచి పరార్ అవుతారట ఈ ముఠా సభ్యులు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: