తెలుగు అకాడమీ స్కామ్‌: ఒక్కడే రూ.200 కోట్లు కొట్టేశాడా ?

Chakravarthi Kalyan
తెలుగు అకాడమీ కుంభకోణంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని  రెండు సంస్థల నుంచి డబ్బులు  కొట్టేసిన సాయి కుమార్ ముఠా లీలులు బయటపడుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి 10 కోట్లు కొట్టేసిన సాయికుమార్... ఆంధ్రప్రదేశ్ సీడ్స్  కార్పొరేషన్ నుంచి మరో ఐదు కోట్ల  ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను డ్రా చేసినట్టు దర్యాప్తులో తేలుతోంది. ఇలా మొత్తం ఆంధ్ర ప్రదేశ్ చెందిన రెండు సంస్థల  నుంచి రూ. 15 కోట్లు డ్రా చేశాడు  సాయికుమార్.

ఏపీ సంస్థల సంబంధించిన డిపాజిట్లను ఐఓబి బ్యాంక్ నుంచి బదలీ చేసిన సాయి కుమార్. ఐఓబి నుంచి ఏపీ మర్కంటైల్ కోపరేటివ్ సొసైటీ కి ద్వారా నిధులు బదిలి, విత్ డ్రా జరిగాయని విచారణలో తేల్చారు. ఏపీకి చెందిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను కాజేసినట్లుగా హైదరాబాద్‌  సీసీఎస్‌ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సీసీఎస్ పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇంతగా మోసగించిన సాయికుమార్ ముఠా పై  కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

ఇప్పటి వరకూ తెలుగు అకాడమీలో కొట్టేసినట్టుగా చెబుతున్న రూ. 60 కోట్ల రూపాయల రికవరీ పై ఇప్పుడు పోలీసులు దృష్టి సారించారు పోలీసులు. మొత్తం మీద తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌  సాయికుమార్  కీలక పాత్ర పోషించినట్టు  గుర్తించారు. ఇతడు గత 12ఏళ్లలో దాదాపు రూ.200 కోట్లు కొల్లగొట్టినట్లు సీసీఎస్ పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈయన కొట్టేసిన డబ్బు ఎవరిదంటే.. ఏపీ హౌజింగ్ బోర్డులో రూ.40 కోట్లు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో రూ.15 కోట్లు, మైనార్టీ సంక్షేమ శాఖలో రూ.45 కోట్లు, ఏపీ సీడ్స్ కార్పొరేషన్‌లకు సంబంధించిన రూ.15 కోట్ల డిపాజిట్లను సాయి దారి మళ్లించాడట. డబ్బును  తెలుగు అకాడమీకి చెందిన రూ. 64.5 కోట్లను ఏపీ మర్కంటైల్ సొసైటీ ఖాతాకు మళ్లించి.. ఆ తర్వాత నిందితులు వాటాలు వేసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద పదేళ్లలో సుమారు రూ. 200 కోట్లను పంచుకున్నట్లు సీసీఎస్ పోలీసులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: