ఆ రక్తపు మరకలు ఎవరివి. అవి లిఫ్ట్ లోకి ఎలా వచ్చాయి. ఆ బాలిక ఒంటిపై ఉన్న గాయాల సంగతి ఏమిటి.. ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు. ఇంకెన్నో పొంతన లేని సమాధానాలు. ఇది విశాఖలో సంచలనం రేకెత్తించిన మైనర్ బాలిక కేసులో అనేక అనుమానాలు వీటన్నింటిపై ఆధారాలు సేకరించేందుకు ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీమ్ మళ్లీ రంగంలోకి దిగింది. దీంతో పోలీసులు నిర్ధారించినట్లు ఇది ఆత్మహత్య లేదా తల్లిదండ్రులు అనుమానిస్తున్నట్లు హత్య అనేది చర్చనీయాంశంగా మారింది. అది విశాఖ నగర శివారులోని శనివాడ గ్రామం సాయి ప్రణవ్ రెసిడెన్సీ, ఆదిత్య అపార్ట్మెంట్ ఎదురెదురుగా ఉన్నాయి. అది అక్టోబర్ 5 అర్ధరాత్రి సుమారు రెండున్నర గంటల సమయం ఒక్కసారిగా పెద్ద శబ్దంతో కలకలం రేగింది. నిద్రలో ఉండాల్సిన కూతురు కనిపించడం లేదని తండ్రి లేచి వెతకసాగాడు. ఇంతలో పెద్ద శబ్దంతో సాయి ప్రణయ్ రెసిడెన్సి కింద ఆ మైనర్ బాలిక అనుమానాస్పద స్థితిలో పడి ఉంది.
పూర్తి వివరాల్లోకి వెళితే జీవనోపాధి కోసం పొట్ట చేత పట్టుకొని విజయనగరం జిల్లా నుంచి వచ్చిన రెండు కుటుంబాలు ఈ సాయి ప్రణయ్ అపార్ట్మెంట్లో వాచ్మెన్ పనిలో చేరారు. మృతురాలు సత్యం పెద్ద కూతురు చలాకీగా ఆడుతూ పాడుతూ ఉండే కూతురు విగతజీవిగా పడి ఉండడంతో అంతా షాక్ అయిపోయారు. తండ్రి సత్యం ఫిర్యాదు ఆధారంగా దువ్వాడ పోలీస్ లు కేసు నమోదు చేశారు. సాయి ప్రణయ్ రెసిడెన్సి రూమ్ నెంబర్ 101 లో ఉన్నటువంటి ఆరుగురు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ తర్వాత నగేష్ అనే యువకుడిని నిందితుడిగా తేల్చారు. మొబైల్ కాల్ డేటా, వాట్సాప్ ఆధారంగా వీరిద్దరి మధ్య కొనసాగిన సంబంధంపై విచారించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఇచ్చిన సమాచారం, సాంకేతికపరమైన ఆధారాలతో నగేష్ ఆ మైనర్ బాలికపై అఘాయిత్యం చేసినట్లు నిర్ధారించారు. పోర్న్ వీడియోలు చూపించి ఆ అమ్మాయిని ఎమార్చాడని తెలిపారు. వీరిద్దరు ఆ రాత్రి బిల్డింగ్ మీద ఉండగా తన తండ్రి పైకి వచ్చే క్రమంలో ఆ బాలిక భయంతో దూకేసింది అని పోలీసులు తెలుపుతున్నారు. దీంతో నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కానీ ఇక్కడే అసలు అనుమానాలు మొదలయ్యాయి. ఆ బాలిక శరీరంపై గాయాలు, మరకలు, ఆ బాలికను కొట్టినట్లు కత్తితో కోసినట్లు గాయాలు ఉన్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఐదు అంతస్తుల భవనం పైనుంచి పడిపోతూ శరీరంపై చిన్న చిన్న గాయాలు మాత్రమే ఎలా తగులుతాయనేది అసలు ప్రశ్న. ఈ తరుణంలోనే బాలిక తల్లిదండ్రుల సిటీ పోలీసు కమిషనర్ను కలిసి న్యాయం చేయాలని కోరారు. అయితే ఇన్ని అనుమానాలు మధ్య లిఫ్ట్లో రక్తపు మరకలు ఉండటం అనేది కీలకంగా మారింది. దీంతో నిందితుడు ఒక్కడేనా లేకపోతే ఇతరుల ప్రమేయం ఉందా అనేది అనుమానించాల్సిన విషయం. దీంతో పోలీస్ కమిషనర్ మనీష్కుమార్ సిన్హా ఆదేశాలతో మరోసారి ఇన్వెస్టిగేషన్ మొదలైంది.