
బెళగావి పరువు హత్య లో 10 మంది అరెస్ట్..
అయిన వారు వినలేదు. కొద్ది రోజుల తర్వాత ఆ యువకుడు రైల్వే ట్రాక్ పై శవమై కనిపించాడు. మొదట ఇది ప్రమాదంగా భావించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు..ఆ తరవాత తదుపరి విచారణను కొనసాగించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన కుమార్తెను ప్రేమించిన వ్యక్తి వేరే కులస్తుడన్న ఒకే ఒక్క కారణంతో ఆ యువకుడిని మనుషుల్ని పురమాయించి చంపింఛాడని పోలీసులు విచారణలో అనుమానాలు తలెత్తాయి. విచారణలో ఈ విషయం నిజమేనని ఆధారాలు ఒక్కొకటిగా బయటకు వస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ కేసులో నిందితులుగా అమ్మాయి తల్లిదండ్రులతో పాటు మరో పది మందిని బెలగావి పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఈ విషయంపై మాట్లాడిన బెలాగవి సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ లక్ష్మణ్ నిబర్గి ఈ కేసుపై మాట్లాడుతూ తమ కూతుర్ని ప్రేమించిన కారణం చేత ఆ యువకుడిని చంపించెందుకు అమ్మాయి తల్లితండ్రులు మనుషుల్ని పెట్టి ఈ హత్య చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆ యువకుడిని చంపి శవాన్ని రైల్వే ట్రాక్ పై విసిరేసి ఆక్సిడెంట్..లేదా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించే నేపథ్యంలో ఆ యువకుడి శరీరాన్ని ట్రాక్ పై వదిలి పెట్టి వెళ్లి ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కేసులో పది మందిని అరెస్ట్ చేశారు. విచారణలో ఇంకెన్ని విషయాలు తెలుస్తాయి చూడాలి.