భార్య ఉరి వేసుకుంటుంటే.. వీడియో తీసిన భర్త.. చివరికి?

praveen
కట్టుకున్న బంధం కడవరకు తోడు ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు..  కష్టసుఖాల్లో అండగా ఉంటుంది అంటూ ఉంటారు..  నేటి రోజుల్లో కట్టుకున్న బంధం కడవరకు తోడు ఉండటం ఏమో కానీ కడతేర్చటం మాత్రం చేస్తోంది.  నేటి రోజుల్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కరువు అవుతుంది. దీంతో తరచూ గొడవలు పడి ఏకంగా ఒకరి ప్రాణాలు కూడా తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు.  మనుషుల్లో మానవత్వం అన్నది కనుమరుగైపోతున్న రోజురోజుకు దారుణం గా వ్యవహరిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

 కష్టసుఖాల్లో తోడుంటానని ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను అంటూ మూడు ముళ్ల సాక్షిగా ప్రమాణం చేసి ఏడు అడుగులు వేసి ఒకటైన భార్యాభర్తలు చివరికి కట్టుకున్న వారిని పున్నామ నరకం లోకి నెడుపుతున్నారు.  ఇలా భార్య భర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవలు ఏకంగా దారుణ హత్యకు కారణం అవుతున్న ఘటనలు నేటి రోజుల్లో కోకొల్లలు అని చెప్పాలి.  అయితే సాటి మనిషి ప్రాణం తీయడంలో కూడా మానవత్వం చూపించలేని వారు చివరికి ఉన్మాదులు గా మారిపోయి హత్యలు చేస్తూ చివరికి ఊచలు లెక్కపెడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  ఇక్కడ ఇలాంటి ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

 సాధారణంగా కళ్లెదుట ఎవరో తెలియని వ్యక్తి ప్రాణం పోతుందే సహాయం చేస్తూ వుంటారు చాలామంది. అదే సొంత వారి ప్రాణాలు పోతున్నాయి అని తెలిస్తే అల్లాడిపోతూ ఉంటారు. రక్షించాలి అని అనుకుంటారు . కానీ ఇక్కడ భర్త మాత్రం కట్టుకున్న భార్య కళ్ళ ముందే చనిపోతున్న ఆపడం కాదు కదా ఏకంగా సెల్ఫోన్లో వీడియో తీసాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు లో వెలుగులోకి వచ్చింది. భర్త కళ్లెదుటే భార్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉరి వేసుకుంటే అడ్డుకోవాల్సిన భర్త ఆమె ప్రాణం పోతున్నా పట్టించుకోకుండా సెల్ ఫోన్ లో వీడియో తీసాడు. అంతటితో ఆగకుండా ఈ వీడియో ని బంధువులకి పంపించాడు. వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు పైశాచికంగా వ్యవహరించిన పెంచలయ్య ఫై   కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: