ఒక్క ముద్దు ఇస్తావా.. 25 వేలిస్తా.. ఏమంటావ్?
కొంతమంది సూటిపోటి మాటలతో చిత్రహింసలకు గురి చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో మహిళ నేటి సమాజంలో ధైర్యంగా బ్రతకలేని పరిస్థితి నెలకొంది. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా మహిళ వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళను వేధిస్తున్న వారిని శిక్షించేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కూడా మహిళలఫై వేధింపులు మాత్రం ఆగడం లేదు. రోజురోజుకు మహిళల రక్షణ కాస్త ప్రశ్నార్థకంగా మారిపోతుంది. అయితే ఇటీవలే ఒక ఆర్ఎంపీ డాక్టర్ కి కూడా ఇలాంటి ఒక చేదు అనుభవం ఎదురైంది. ఎంతో మందికి వైద్యం అందిస్తూ సేవ చేస్తున్న ఆర్ఎంపీ డాక్టర్ పట్ల వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు.
ఈ క్రమంలోనే సదరు వ్యక్తిపై పోలీసులు నిర్భయ కేసు తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. ఈ ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మొయినాబాద్ మండలంలోని ఓ గ్రామంలో దళిత మహిళ ఎంపీ క్లినిక్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఇటీవలే సదరు ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు ఆరోగ్య సలహా కోసం ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి వచ్చాడు. ఈ సమయంలోనే ఆర్ఎంపీ డాక్టర్ తో ఎంతో దారుణంగా ప్రవర్తించాడు. ఒక ముద్దు ఇస్తావా ఇరవై ఐదు వేలు ఇస్తాను ఐదు నెలలు క్లినిక్ అద్దె కూడా చెల్లిస్తాను అంటూ ఎంతో అసభ్యంగా మాట్లాడాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.