మా కుటుంబాన్ని ఆదుకోకపోతే ఆత్మహత్యే దిక్కు..?

MOHAN BABU
 అతను చేసిన ఒక్క తప్పు  ఇంతమందిని రోడ్డున పడేసిందని చెప్పవచ్చు. ఆ కామపిశాచి  తనకు తాను కన్నుమూసాడు. కానీ రెండు కుటుంబాలలో ఎంతో విషాదాన్ని నింపాడు. వాడు తప్పు చేసే ముందు ఒక్కక్షణం ఆలోచించి ఉంటే ఇంతటి విషాదం జరిగి ఉండేది కాదు. ఈ రెండు కుటుంబాలు ఈ రోజు అనుభవించే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. నిందితుడు రాజు చేసినా ఆ తప్పుకు ఒక కుటుంబం తన బిడ్డకు దూరమై కడుపుకోత మిగిలింది. మరో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. నిందితుడు రాజు భార్య పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రాజు తల్లి బిక్కు బిక్కుమని  ఏడుస్తోంది. వాడు చేసిన పాపపు పనికి వారి కుటుంబం సమాజంలో తలెత్తుకుని తిరిగే  పరిస్థితి కరువైంది. అతన్ని కన్నందుకు ఆ తల్లికి కడుపుకోత, అతన్ని కట్టుకున్నందుకు  ఆ భార్యకు ఆ ఆవేదన..

వారు ఏ తప్పు చేయలేదు. రాజు చేసిన తప్పుకు  వారి 11 నెలల పాప నుంచి ముసలి తల్లి వరకు  శిక్షను అనుభవిస్తున్నారు. కనీసం ఉండడానికి ఇల్లు లేకుండా పోయింది. దీంతో వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. దీంతో నిందితుడి భార్య  మౌనిక తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటుంది. సైదాబాద్ ఘటనలో  నిందితుడైన రాజు  ఆయన భార్య పల్లకొండ మౌనిక తన ఆవేదన అంతా మీడియా ఎదుట చెప్పింది.  నిందితుడు రాజు దహన సంస్కారాలు నిర్వహించిన అనంతరం  ఆమె మాట్లాడుతూ  తన భర్త ఆ పాపపు పని చేసాడో లేదో తెలియదు కానీ , అతనే ఆ చిన్నారిని లైంగిక దాడి చేశారని చెప్పి  నా భర్తను పోలీసులు చంపారని ఆమె ఆరోపించింది. దీంతో మా అత్తమ్మ, నేను, నా చంటి బిడ్డ  అనాధలుగా మారమని బోరున విలపించింది.

 ఇలాంటి ఘటనలు గతంలో కూడా అనేకం జరిగాయని, అప్పుడు కూడా పోలీసులు ఇలాగే వ్యవహరించారని ఆమె ప్రశ్నించింది. ప్రస్తుతం తమ కుటుంబానికి  మగదిక్కు అనేది లేకుండా పోయింది అని , నేను నా 11 నెలల కుమార్తె  ఎలా బతకాలి అని అడిగింది. తమకు ఉన్న కాస్త చిన్న ఇంటిని కూడా  ధ్వంసం చేశారని, బంధువుల ఇళ్లలో ఎన్ని రోజులు ఉంటామని తమను ప్రభుత్వం ఆదుకోవాలని, న్యాయం చేయాలని రోదించింది. ఏది ఏమైనా నిందితురాలు చేసిన తప్పుకు  ఈ కుటుంబం నిర్ధాక్షణ్యంగా బలి అయిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: