వామ్మో.. ఇదేం ఐడియా గురూ.. ఇంత క్రియేటివిటీ ఎలా?
కొన్ని కొన్ని సార్లు అక్రమ మద్యం రవాణా చేస్తున్న వారి అతి తెలివి చూసి పోలీసులు షాక్ అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయ్. ఇక ఇటీవలే ఎంతో వినూత్నంగా ఏకంగా సినిమాల రేంజ్ లో అక్రమ మద్యం రవాణా చేయాలి అని భావించారు. కానీ చివరికి పోలీసులకు సమాచారం అందడంతో ఇక అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులు కటకటాల పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏపీలో మద్యం పై ఆంక్షలు ఉండడంతో పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం రవాణా చేసేందుకు ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారు.
కానీ అటు పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేసి అనేక అక్రమ రవాణా చేస్తున్న వారికి ఊహించని షాక్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసుల కళ్ళుగప్పి ఎట్టి పరిస్థితుల్లో అక్రమ మద్యం రవాణా చేయాలనే ఉద్దేశంతో వినూత్న పోకడలకు పోతున్నారు కేటుగాళ్ళు. ఇక ఇటీవల ఏకంగా పోలీసుల నుంచి తప్పించుకుని అక్రమ మద్యం రవాణా చేసేందుకు సరికొత్త ప్లాన్ వేసారు. ఏకంగా కృష్ణా నది ద్వారా అక్రమంగా మద్యం తరలించేందుకు నిర్ణయించారు. నదీ మార్గంలో చేపల పుట్టిలో తెలంగాణ నుంచి ఏపీకి 400 లీటర్ల నాటుసారాను తరలించాలని అనుకున్నారు. కానీ పోలీసులకు సమాచారం అందడంతో చివరికి రంగంలోకి దిగిన పోలీసులు ఇక నాలుగువందల లీటర్ల నాటుసారాను పట్టుకున్నారు. ఇందులో ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.