ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ముగ్గురు యువతులు మోసం చేశారు.. చివరికి?

praveen
ప్రస్తుతం ప్రేమ అనేది మోసానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఎంతోమంది ప్రేమ అనే ముసుగు వేసుకొని అవసరాల కోసం ప్రేమిస్తూ అవసరాలు తీరిన తర్వాత నడిరోడ్డు మీద వదిలేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే  ఇటీవల కాలంలో ఎంతో మంది యువతులు  మోసగాళ్ల మాయ మాటలు నమ్మి చివరికి నడిరోడ్డుమీదకి వచ్చిన ఘటనలు ఎన్నో తెరమీదకు వచ్చాయి. ఇలా ఆడ పిల్లలు ఎంతో మంది మోసగాళ్లు చేతిలో మోసపోయినప్పుడు సభ్య సమాజం మొత్తం అయ్యో అంది. అయితే కేవలం ఆడపిల్లలు మాత్రమే కాదు అటు నేటి రోజుల్లో  యువకులకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అన్నది కొన్ని ఘటనలు చూస్తే అర్థమవుతుంది.

 కేవలం అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఎంతో మంది యువకులను నమ్మించి మాయమాటలతో మోసం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది యువకులు ఇక ప్రేయసి చేసిన ద్రోహాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆ యువకుడిని ముగ్గురు అమ్మాయిలు మోసం చేశారు. దీంతో అతని మనస్సు బరువెక్కింది. ఏం చేయాలో అర్థం కాలేదు. బాధ ఎవరికి చెప్పుకోవాలి తోచలేదు. చివరికి ఇక చావే శరణ్యం అనుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

 ఈ ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం లో వెలుగులోకి వచ్చింది. మొరిపిరాల కు చెందిన సందీప్ కి స్రవంతి అనే అమ్మాయి తో పరిచయం ఉంది.  ఇక ఆ యువతి మరో ఇద్దరు యువతులను తన స్నేహితులు అంటూ సందీప్ కు పరిచయం చేసింది. ఈ క్రమంలోనే ఇక సందీప్ తో ముగ్గురు యువతులు కూడా ఎంతో చనువుగా వుండే వారు. ఈ క్రమంలోనే ఏకంగా లక్ష రూపాయలు అవసరం ఉన్నాయి అని అడగడంతో వెంటనే సందీప్ ఆ డబ్బులు ఇచ్చాడు. ఇక్కడి వరకు  అంతా బాగానే ఉన్నా డబ్బులు రిటర్న్ ఇవ్వమని అడిగేసరికి యువతులు అసలు రంగు బయట పెట్టారు . మానసికంగా హింసించడం మొదలుపెట్టారు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు పురుగుల మందు తాగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: