అమ్మా.. మమ్మల్ని ఎందుకు చంపేస్తున్నావ్?
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డల పాలిట ఆ తల్లి మృత్య శకటంగా మారిపోయింది. కుటుంబ సమస్యలు చుట్టుముట్టడంతో చివరికి అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లల ప్రాణాలు తీయడానికి సిద్ధమైంది. గోరు ముద్దలు పెట్టిన ఆ చేతులతోనే గొంతు నులిమి చంపేసింది. పిల్లలది అభం శుభం తెలియని వయసు.. గోరు ముద్దలు పెట్టిన అమ్మ గొంతు నులుముతుంటే.. అమ్మ మమ్మల్ని ఎందుకు చంపేస్తున్నావ్.. అంటూ దీనంగా అమ్మ కళ్ళలోకి చూసారూ ఆ పిల్లలు.
అయినప్పటికీ ఆ తల్లి మనసు మాత్రం కరగలేదు. గుండె రాయి చేసుకుని ఆ తల్లి చివరికి కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలను కూడా గొంతు నులిమి చంపేసింది. ఈ ఘటన సంగారెడ్డి పట్టణం లోని శాంతి నగర్ కాలనీలో వెలుగులోకి వచ్చింది. ఇద్దరు పిల్లలను గొంతునులిమి హత్య చేసిన తల్లి అనంతరం తాను కూడా కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. చివరికి ఆ తల్లి ప్రస్తుతం కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతోంది. కుటుంబ కలహాల వల్లే ఆ తల్లి ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చు అని స్థానికులు భావిస్తున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.