వివిధ ఉద్యోగాల పేరిట కొంతమంది వ్యక్తులు గ్రామాల్లోకి వెళ్లి పేద మధ్య తరగతి యువతులను, మైనర్ బాలికలను తీసుకెళ్లి వారిపై లైంగిక దాడులు చేస్తున్నారు. ఇంకా కొంత మందిని బలవంతంగా వ్యభిచార గృహాలలోకి దింపి ఆ పనులు చేయిస్తున్నారు. ఇలా వారి పేదరికాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఇలా చేస్తున్నారు. ఇంకొంతమంది వ్యక్తులు ఇటుక బట్టీల వద్ద కూడా మైనర్లను తీసుకెళ్ళి అత్యా చారాలు చేస్తూ, ఆ బట్టీలలో పనులు చేయించు కుంటున్నారు. అలాంటి సంఘటనే ఈ ముగ్గురు మైనర్ అమ్మాయిలకు పని ఇచ్చే నెపంతో వారిని ఆకర్షించారు. ఆపై నిర్బంధించి ఒకరిపై అత్యాచారం చేశారు.
జార్ఖండ్‌లోని రాంచీలో ఇస్తా అనే వ్యక్తి ముగ్గురు బాలికలను ఉద్యోగ అవకాశాల నెపంతో వారిని ఆకర్షించి వారణాసికి తీసుకెళ్లి వారిలో ఒకరిపై అత్యాచారం చేశాడు. రాంచీకి చెందిన ముగ్గురు బాలికలను నిర్బంధంలో హింసించారని సమాచారం. రాంచీలోని సంగ గ్రామంలో నివసిస్తున్న ఆ ముగ్గురు బాలికలకు వారణాసిలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వారి ఇంటి నుంచి తీసుకెళ్లారు. ఈ ముగ్గురు మైనర్ బాలికలను ఇటుక బట్టీ వద్ద పని చేయడానికి వారణాసికి తీసుకుని వెళ్లి ఇటుక బట్టీల వద్ద పని చూపించారు. ఇక్కడ కొద్ది రోజులు పని చేసిన తర్వాత సదరు బాలికలను ఉత్తరప్రదేశ్‌లోని గోండాలోని మంకాపూర్ ప్రాంతంలోని బెనిపూర్ గ్రామంలో మరొక ఇటుక బట్టీల వద్దకు తీసుకెళ్లి పని చేయించారు. ఇదే క్రమంలో వారి కుటుంబంతో సంబంధాన్ని అనుమతించలేదు. బాలికలను నిందితులు కాంకేలోని సుకుర్హుతులోని ఒక ఇంటికి తీసుకెళ్ళి ఆ ఇంట్లో రోషన్ కుమార్ అనే వ్యక్తి బాలికలలో ఒకరిపై అత్యాచారం చేశాడు. మరుసటి రోజు, నిందితులు ముగ్గురు బాలికలను వారణాసిలోని ఒక ఇటుక బట్టీకి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా బాలికలలో ఒకరు తన తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. ఇంతలో అతను ఫోన్ తీసుకొని సిమ్ కార్డు విరిచేశాడు.
దీంతో బాలికల తల్లిదండ్రులు ఆందోళన చెంది రాంచీలోని ఐఎఫ్ఐ అనే ఒక సంస్థకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన గురించి ఐఎఫ్‌ఐకి చెందిన ముగ్గురు కుముద్ని, కెర్కెట్టా మరియు అపర్ణ బడా అనే ముగ్గురు బాలికలను రక్షించి పిథోరియా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిలో ఒకరిపై అత్యాచారం, మానసిక హింసకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో బాలికల వేధింపులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ ముగ్గురు ప్రాణాలతో బయట పడ్డారు. ఇదే కాకుండా జర్ఖండ్ మరియు ఇతర రాష్ట్రాలకు చెందిన అనేక మంది మహిళలు వారణాసిలోని ఇటుక బట్టీల వద్ద బంధన కార్మికులుగా పనిచేస్తున్నారని మరియు నిరంతరం దాడికి గురవుతున్నారని వెల్లడించారు. బట్టీ నుండి ఇతర బంధన కార్మికులను రక్షించడానికి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.