దారుణం : కొడుకును కొట్టినందుకు తండ్రిని చంపేశాడు?

praveen
ఇటీవలి కాలంలో మనుషుల్లో మానవత్వం బొద్దిగా కరువైపోతుంది. ఈ మాట ఎవరో చెబుతున్నది కాదు.. నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మొన్నటి వరకు కేవలం పరాయి వ్యక్తుల విషయంలో దారుణంగా వ్యవహరించేవారు మనుషులు   కానీ నేటి రోజుల్లో మాత్రం  ఏకంగా సొంత వారి విషయంలో కూడా ఉన్మాదులు గా మారిపోతున్నారు. ఏకంగా క్షణికావేశంలో ఎన్నో దారుణాలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.  ఏకంగా సొంత వారికి రక్షణ కల్పించాల్సింది పోయి ఉన్మాదులు గా  మారిపోయి ప్రాణాలను సైతం తీసేందుకు వెనుకాడటం లేదు.


 రోజురోజుకు ఇలాంటి తరహా ఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి.  ఇక్కడ ఇలాంటి ఒక అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా కన్న తండ్రిని హత్య చేశాడు ఇప్పుడు ఒక వ్యక్తి.  కొడుకు మీద ఉన్న ప్రేమ కన్న తండ్రిని హత్య చేసేందుకు వరకు వెళ్ళింది. సాధారణంగా  పిల్లలు ఎప్పుడూ మారాం చేయటం లేదు అల్లరి చేయడం చేస్తూ ఉంటారు.  కొన్నిసార్లు పెద్దలకు విసుగు తెప్పిస్తు ఉంటారు.  ఇలా చేసినప్పుడు ఇక పెద్దలు మందలించడం కామన్..  పొరపాటున కొన్ని కొన్ని సార్లు చేయి కూడా చేసుకుంటూ ఉంటారు. ఇది కూడా సర్వసాధారణమే. ఇక్కడ ఒక వ్యక్తి ఏకంగా తన కొడుకు పై చేయి చేసుకున్నాడు అనే కారణంతో కన్నతండ్రే దారుణంగా హత్య చేశాడు.



 ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చింది. ఇటీవలే 8 ఏళ్ల బాలుడు అల్లరి చేశాడు.  ఈ క్రమంలోనే పక్కనే ఉన్న తాత ఆ బాలుడు మందలించాడు. అయినప్పటికీ బాలుడు అల్లరి చేయడం ఆపకపోవడంతో  కోపం వచ్చి చెంపపై ఒక్కటీ వేశాడు.  అప్పుడే ఇంట్లోకి వచ్చిన తండ్రి అది చూసి సహించలేక పోయాడు. నా కుమారుడునే కొడతావా అంటూ ఏకంగా కన్న తండ్రి తో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి వివాదం చిలికి చిలికి గాలివానలా మారి పోయింది.  దీంతో ఇక ఆ బాలుడి తండ్రి కోపోద్రిక్తుడిగా మారిపోయాడు.  ఇంట్లో ఉన్న కర్రతో దారుణంగా కన్న తండ్రిని  చితకబాదాడు.  ఇక దెబ్బలు తాళ లేక పోయినా ఆ వృద్ధుడు సోమ్మాసిల్లీ అక్కడికక్కడే పడిపోయి ప్రాణాలు వదిలాడు  స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: