చిన్నారులే టార్గెట్.. వరుస అత్యాచారాలు.. ఆపై..?

MOHAN BABU
 దేశంలో అత్యాచారాల రేటు చాలా వేగంగా పెరుగుతుంది. దేశంలో ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి మృగాళ్ల చేతిలో ఎందరో చిన్నారులు నుంచి మొదలు ముసలి వాళ్ళ వరకు ఈ మృగాళ్ల చేతిలో నలిగిపోతూనే ఉన్నారు. పుట్టిన పాప నుంచి మొదలు వందేళ్ల వృద్ధురాలి వరకు ఏ ఒక్కరిని కూడా వీరు వదిలిపెట్టడం లేదు. ఇలా దేశంలో చాలా మంది సైకో గాళ్ళు చిన్నపిల్లలను, యువతులను ఏదో ఒక చోట  చరచుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని పకడ్బందీ చట్టాలు తీసుకొచ్చినా ఏ ఒక్కరికి కూడా  భయం అనేది కలగడం లేదు. ఇలాంటి ఘటనలు ఇన్ని రోజులు పట్టణాల్లోనే జరిగేవి.
 కానీ గ్రామాల్లో కూడా ఇలాంటి నేర ప్రవృత్తికి చాలా మంచి అలవాటు పడుతున్నారు. అంటే చుట్టాలు ఏం చేయవు అని అర్థమా. ఎవరు ఏం చేస్తారులే అనే అహంకారమా. ఏమో తెలియదు కానీ ప్రతి చోటా మృగాళ్ల చేతిలో ఎంతోమంది ఆడ తల్లులు  అసువులు భాస్తున్నారు. అలాంటి ఒక మృగాన్ని  హైదరాబాద్ పోలీసులు  పట్టుకున్నారు. ఏం జరిగిందో..! అది ఎక్కడో చూద్దాం..?
 హైదరాబాదులోని  జవహర్ నగర్  పరిధిలో ఉన్న చిన్నారులపై అభిరాం అనే వ్యక్తి ఈ మధ్య వరుసగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. వారం రోజులలో ఇద్దరు చిన్నారులపై అభిరామ్ అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఒడిశాకు చెందిన అభిరామ్ జవహార్ నగర్ లో గత కొద్ది రోజులుగా నివాసం ఉంటున్నాడు. ఆయన చిన్నపిల్లలను టార్గెట్ చేస్తూ బిస్కెట్లు, చాక్లెట్లు ఆశ చూపి తనతో తీసుకు వెళ్లి అత్యాచారాలకు పాల్పడుతు న్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే  గురువారం రోజున కూడా ఒక చిన్నారిని  కిడ్నాప్ చేయడానికి అభిరామ్ ప్రయత్నించాడని. ఈ నెల నాల్గవ తేదీన మూడు సంవత్స రాల చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడని రాచకొండ పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి  సీసీ పూటేజీలో అంత రికార్డు కాగా దానిద్వారా అభిరాం నీ పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. ఇలా వరుస అత్యాచారాలకు పాల్పడుతున్న నిందితున్ని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: