యువకుడి కామం.. చెరువులో శవం.. విచారణలో దిమ్మతిరిగే నిజం?

praveen
ఇటీవలే కర్నూలు పట్టణంలో వెలుగులోకి వచ్చిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఏకంగా ఒక వ్యక్తి చెరువులో శవమై కనిపించాడు. అయితే ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారడంతో దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు.  ఈ విచారణలో వెలుగులోకి వచ్చిన నిజాలతో పోలీసులు సైతం షాక్ అయ్యారు. గ్రామంలోని ఎంతో మంది మహిళలను వేధించడం మగవాళ్లను చులకనగా చేసి మాట్లాడటం కారణంగానే అతని హత్య జరిగినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు.

 వివరాల్లోకి వెళితే..  కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో చెరువులో ఇటీవల ఒక శవం లభ్యమైంది. పోలీసులు విచారించగా ఈ కేసు మిస్టరీ వీడింది. బోయ వెంకటేష్ అనే వ్యక్తి గ్రామంలో మహిళలపై తరచూ అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండేవాడట. ఇక ఎంతో మంది మహిళలపై లైంగిక వేధింపులకు కూడా పాల్పడే వాడట. అంతేకాదు ఇక గ్రామంలోని మగవాళ్ళని సైతం చులకనగా చేసి మాట్లాడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వాడని నిందితులు విచారణలో తెలిపినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే రోజురోజుకు వెంకటేష్ వ్యవహార శైలి మరింత దారుణంగా మారిపోతుండటంతో గ్రామస్తులందరూ వెంకటేష్ తీరుతో విసిగి పోయారు.

 దీంతో పక్కా ప్లాన్ ప్రకారం అతని హత్య చేసినట్లు పోలీసులు విచారణలో అంగీకరించారు నిందితులు. ఈనెల 15వ తేదీన రాత్రి సమయంలో బయటికి వెళ్లి వస్తాను అంటూ చెప్పిన వెంకటేష్ మళ్ళీ తిరిగి రాలేదు. ఇక చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన కుటుంబసభ్యులు ఇక లాభం లేదు అని భావించి జూన్ 19వ తేదీన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక జూన్ 21వ తేదీన చెరువులో ప్లాస్టిక్ సంచిలో మూటకట్టి శవం లభ్యమైంది. మృతదేహం  వెంకటేష్ దే అని అటు కుటుంబ సభ్యులు గుర్తించారు. అయితే అర్ధరాత్రి బయటకి వచ్చిన వెంకటేష్ ను నిందితులు మాయ మాటలతో నమ్మించి ఆటోలో చెరువు వరకు తీసుకువచ్చి అక్కడ మారణాయుధాలతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: