పురుషుల్లో లైంగిక కోరికలను పెంచటానికి వయాగ్రా లాంటి మాత్రలు ఉన్నాయి. కానీ మహిళల్లో మాత్రం లైంగిక వాంఛను పెంచే మాత్రలు పెద్దగా మార్కెట్ లోకి రాలేదు. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా పరిశోధకులు చేసిన కృషి వల్ల ఆ లోటు తీరనున్నట్టు కనిపిస్తోంది. అంతే కాకుండా ఇది వయాగ్రా మాత్రలు కూడా కాదు.. ముక్కు ద్వారా తీసుకునే నసల్ స్ప్రే. ఈ స్ప్రే వయాగ్రా కంటే ఎంతో భిన్నమైనది. స్ప్రే లో బీపీ1010 అనే మాలిక్యుల్ ఉంటుంది. ఇది ముక్కు ద్వారా ప్రయాణించి. మెదడు లో సెక్స్ కోరికలు పెంచుతుంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా కు చెందిన మోనాష్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుజేన్ డావిష్ వెల్లడించారు. లైంగిక సమస్యలు ఎదురుకొంటున్న మహిళలకు ఇది ఏంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఆస్ట్రేలియా లోని ఓ స్టడీ ప్రకారం...30 ఏళ్ళ వయస్సు ఉన్న 10మందిలో ఒకరికి లైంగిక కోరికలు చాలా తక్కువగా ఉన్నాయి. 40 సంవత్సరాలు దాటిన మహిళలకు మరీ తక్కువగా ఉన్నాయి.
శారీరకంగా దృఢంగా ఉన్నప్పటికీ పని ఒత్తిడి ఇతర కారణాల వల్ల లైంగిక కోరికలు తగ్గుముఖం పడుతున్నాయి. దాంతో మహిళలపై ఈ నసల్ స్ప్రే ను ప్రయోగించగా మంచి ఫలితాలు వచ్చినట్టు నిర్ధారణ అయ్యింది. లైంగిక కోరికలు తక్కువ ఉన్న మహిళల్లో..లైంగిక సమస్యలు ఎదురుకొంటున్న మహిళల్లో స్ప్రె వాడటం వల్ల సమస్యలు తగ్గుముఖం పెట్టినట్టు తేలింది. మరిన్ని ప్రయోగాల కోసం 30 నుండి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలను ఆహ్వానిస్తున్నారు. ఇది మార్కెట్ లోకి వస్తే మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఈ వార్త విన్న పురుషులు ఇలాంటి నసల్ స్ప్రే తమకోసం కూడా తయారు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. మాత్రలు మింగడం కంటే ఇది ఎంతో మేలు అని భావిస్తున్నారు. మరి ఆస్ట్రేలియా పరిశోధకులు పురుషుల కోసం కూడా ఇలాంటి స్ప్రే ను తయారు చేస్తారో లేదో చూడాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: