ముంబైలో ఫెమస్ ఫుడ్ ఏంటో తెలుసా? అంత క్రేజ్ ఎందుకంటే?

Satvika
ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వంటకు ప్రత్యేకత ఉంటుంది. హైదరాబాద్ కు ధమ్ బిర్యాని ఎంత ఫెమస్ అనేది ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ బిర్యాని ప్రాచుర్యం పొందింది. ఇకపోతే ఢిల్లీలో గొల్గప్పా బాగా ఫెమస్. అదే మన భాషలో పానీపూరి.. ఇక ముంబాయి విషయాన్నికొస్తే ఎన్నో రకాల వంటలు ఫెమస్.. అందులో ఫిజ్జా ఎక్కువ వినిపిస్తుంది. ఫిజ్జాలొ చీజ్ తో పాటు వాడుతున్న అన్నీ కూడా నోటికి రుచిగా ఉంటాయి. అందుకే వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇష్టపడుతున్నారు..కాగా, ఎక్కడకు వెళ్ళినా ఫిజ్జాకు మంచి డిమాండ్ ఉంది.

నిజానికి ఈ ఫిజ్జా అనేది ఇటాలియన్ ఫుడ్.. ఇది పుట్టింది అక్కడే.. మొదట్లో కొన్ని రకాల వాటితో చెస్తె ఇప్పుడు మాత్రం కొత్త కొత్త వాటిని ఉపయొగిస్తూ తయారు చేస్తున్నారు. అందుకే వీటికి డిమాండ్ రాను రాను ఎక్కువ అవుతుంది..టమాట, క్యాప్సికమ్‌, ఆలివ్స్‌, చీజ్‌, స్పైసెస్‌ వంటి పదార్ధాలతో టాపింగ్ చేస్తారు. ఫిజ్జా అనే పేరు వస్తే అన్నీ గుర్తుకు రావడం తో నోరు ఊరుతుంది. నాన్ వెజ్ ప్రియుల కోసం నాన్ వెజ్ ఫిజ్జాలు ఉన్నాయి. అలాగే వెజ్ ప్రియుల కోసం వెజ్ ఫిజ్జాలు కూడా ఉన్నాయి.

అయితే ఇప్పుడు ముంబాయి లోని ఒక ఫిజ్జా బాగా ఫెమస్ అయ్యింది. మాములుగా ఫిజ్జాలు అనేవి గుండ్రంగా ఉంటాయి. 99 శాతం అలానే వుంటాయి. కానీ కుండలో తయారు చేస్తున్న ఫిజ్జా గురించి ఎవరైనా విన్నారా? ఏంటి కుండలో ఫిజ్జా ఎలా చేస్తారు అనే సందేహం అందరికి కలగడం ఖాయం.ముంబైలో మట్కా పిజ్జా చాలా పాపులర్‌. రోడ్డు పక్కన తోపుడు బండ్లనుంచి ఫైవ్‌ స్టార్‌ హోటళ్ల వరకూ.. ఈ ఫిజ్జాను ఒక్కోచోట ఒక్కోలా చేస్తారు. కొంతమంది నిప్పుల పై  కుండను పెట్టి వేయించిన పిజ్జా బేస్‌ పైన పనీర్‌, కూరగాయల ముక్కలు, చీజ్‌ వేసి పైనుంచి ఆలివ్స్‌, డబుల్‌ చీజ్‌ లేయర్‌ వేసి స్మోక్డ్‌ ఫ్లేవర్‌తో దీన్ని తయారు చేస్తారు. మరికొందరు కాస్త ఒవెన్‌లో చేస్తారు. ఎలా చేసినా కూడా ఈ ఫిజ్జా టేస్ట్ వేరే లెవల్ .. మీరు కూడా ముంబాయి వెళ్ళినప్పుడు ట్రై చెయ్యండి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: