ఈవెనింగ్ స్నాక్స్ : సమోసాలకు సరికొత్త ట్విస్ట్

Vimalatha
చాలామంది సాయంత్రం స్నాక్‌గా ఎక్కువగా ఇష్టపడే చిరుతిండి సమోసా. అయితే మార్కెట్‌ లో దొరికే ఈ చిరు తిండిని తక్కువగా తినడం మంచిది. ఎందుకంటే ఇది వేపుడు, పైగా అనారోగ్యకరమైనది. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అయితే ఇప్పుడు సమోసాలకు కొత్త ట్విస్ట్ ఇస్తూ ఇంట్లోనే ఆరోగ్యకరంగా, రుచికరంగా సిద్ధం చేసుకోండి. పెద్దలు, పిల్లలు వీటిని బాగా ఇష్టపడతారు. కాబట్టి సమోసాల తయారీ విధానం తెలుసుకుందాం.
సమోసాల లోపల నింపడానికి పనీర్‌ను ఉపయోగించడం వల్ల మరింత రుచికరమైన, ఆరోగ్యకరమైన టేస్ట్ తో ఈవెనింగ్ స్నాక్స్ చేయవచ్చు. బంగాళదుంప సమోసాల రుచి కూడా అద్భుతంగా కనిపిస్తుంది. పనీర్ సమోసాల తయారీకి మెత్తగా తురిమిన పనీర్, పచ్చి బఠానీలు, ఎండుమిర్చి, ఎర్ర కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినట్లుగా ఉప్పు అవసరం. ముందుగా పచ్చి బఠాణీలను ఉడికించుకోవాలి. తరువాత పనీర్‌ తో పాటు ఉడికించిన పచ్చి బఠానీ లను, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ ను వేసి కలపండి. ఉప్పు, మిరియాల పొడి, ఎర్ర కారం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి సమోసాల్లో స్టఫ్ చేయడానికి ఉపయోగించండి.
పిండిలో రెండు చెంచాల నూనె వేయాలి. తర్వాత గట్టిగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా సిద్ధం చేసుకున్న పిండిని గుండ్రంగా తయారు చేసుకోవాలి. పూరీలా రుద్ది మధ్య నుంచి కోసుకోవాలి. తర్వాత ఈ షీట్‌ లకు త్రిభుజాకార ఆకారం ఇచ్చి అందులో పనీర్ మిశ్రమ పదార్థాలను నింపండి. ఇప్పుడు సమోసా షీట్ ను అన్ని వైపులా నీటిని ఉపయోగిస్తూ చేతితో క్లోజ్ చేయండి.  అలా తయారు చేసుకున్న సమోసాల ను ఆయిల్ లో డీప్ ఫ్రై చేయండి. అంతే వేడి వేడిగా హెల్దీ సమోసా రెడీ ! మీరు దీన్ని ఆరోగ్యంగా చేయాలనుకుంటే నూనెలో వేయించడం కంటే కాల్చండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: