కొత్తిమీర రైస్ చేసేదాం పదండి

Manasa
వంట అంత చేశాక పై నుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తారు కదా ఈరోజు దానితో నే రైస్ చేద్దాం. కోతిరిమిరా రైస్ ఆ అని షాక్ అవకండి. చాలా బాగుంటుంది.ఒకసారి చేస్తే ఇంకా నెక్స్ట్ టైం నుంచి కొత్తిమీర ని గార్నిష్ కి వాడటం మానేసి  "కొత్తిమీర  రైస్" కి షిఫ్ట్ అవుతారు


కొత్తిమీర రైస్ కు కావలసిన పదార్థాలు:

బాస్మతి బియ్యం - 1 గ్లాసు  

కొత్తిమీర-5 కట్టలు 

 పచ్చిమిరపకాయలు-8

 పసుపు-చిటికెడు 

 ఉప్పు-తగినంత 

 నూనె- నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్స్ 

 నేయి- 2 టేబుల్ స్పూన్లు 

 జీడిపప్పు-గుప్పేడు 

 జిలకర-1 టీ స్పూన్ 

దాల్చిన చెక్క-చిన్న ముక్క 

 లవంగాలు -2


 కొత్తిమీర రైస్ తయారు చేసే విధానం:

 ముందుగా బాస్మతి బియ్యాన్ని కడిగి అరగంట సేపు నీళ్లలో అలాగే ఉంచాలి.

తర్వాత బాస్మతి బిర్యానీ పొడి పొడిగా వండుకోవాలి.

 ఇప్పుడు కొత్తిమీర కట్టలు తీసుకొని  శుభ్రంగా కడుగుకోవాలి.

కొత్తిమీర ని  సన్నగా తరుగుకోవాలి.  

8 పచ్చి మిరపకాయలు  తీసుకొని  కాట్లు పెట్టు కోవాలి.

ఇప్పుడు ఒక్క కడాయి తీసుకొని  కొద్దిగా నూనె, నెయ్యి వేయాలి. నూనె వేడి అయ్యాక  అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు,చిన్న ముక్క దాల్చిన చెక్క వేసి అది పక్కకు పెట్టుకోవాలి.

తరువాత దాంట్లో  జీడిపప్పు మరియు పచ్చి మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి.  ఇప్పుడు సన్నగా తరుగుతున్న కొత్తిమీర  వేసి బాగా కలుపుకొని,చిటికెడు  పసుపు వేసి మల్లి  దాన్ని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.

 ముందు గా  వండుకున్న బాస్మతి రైస్ ను చేర్చుకోండి  దానిలో ఈ కొత్తిమీర పేస్ట్ మరియు  తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి.

 ఎంతో రుచి కరమైన కోతిమిర రైస్  రెడీ.

పై నుంచి కొన్ని జీడిపప్పు  ముక్కలు, పలుకులతో దీనిని గిరీష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేస్తే అద్భుతః అంటారు

దీనిని పెరుగు పచ్చడి తో సర్వ్ చేయవచ్చు.గ్రీన్ రైస్ లిస్టులో ఈ కొత్తిమీర రైస్ ను ఆడ్ చేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: