కర కరలాడే క్యాబేజి పకోడీలు తిందామా. !

Suma Kallamadi
క్యాబేజి కూర కంటే క్యాబేజి పకోడీ చాలా బాగుంటుంది.కొంతమంది కూర తినడానికి ఇష్టపడరు అందుకనే క్యాబేజి పకోడీని వేసి చూడండి  ఎంతో రుచికరంగా వుంతుంది.ఇండియా హెరాల్డ్ వారు మీకోసం క్యాబేజి పకోడీ ఎలా తయారు చేయాలో మీకు వివరించబోతున్నారు.
 కావలిసిన పదార్ధాలు:
300 గ్రాములు క్యాబేజీ తరుగు
4 పచ్చి మిరప కాయలు సన్నగా తరిగినవి
¼ కప్పు పుదీనా ఆకులు
2 రెమ్మలు కరివేపాకు
½ అంగుళం అల్లం తరుగు
ఉప్పు తగినంత
1 tsp వాము
1 కప్పు శనగ పిండి
చిటికెడు ఎర్ర రంగు (ఆప్షనల్)
నూనె డీప్ ఫ్రై కి సరిపడా
కార్న్ ఫ్లోర్
తయారీ విధానం :
ముందుగా ఒక గిన్నె తీసుకోని అందులో  ముక్కలుగా తరుగుకున్న క్యాబేజీ, పచ్చి మిర్చి ముక్కలు, కొద్దిగా  ఉల్లి పాయ ముక్కలు, అలాగే తరిగిన అల్లం ముక్కలు, కొద్దిగా పుదీనా ఆకులు అలాగే కరివేపాకు, వాము, శెనగ పిండి, తగినంత ఉప్పు వేసి కొద్దిగా కొద్దిగా నీరు పోస్తూ కలపాలి.మరి ఎక్కువగా నీళ్లు పోయకూడదు. అంటే మిశ్రమం జారుడుగా ఉండకూడదు. అలాగే చూడడానికి కలర్ ఫుల్ గా ఉండాలంటే కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేయండి. అలాగే క్రిప్సీ గా ఉండాలంటే కార్న్ ఫ్లోర్ వేస్తే కర కర ఆడుతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేడి చేయాలి.నూనె బాగా కాగిన తరువాత కొద్దిగా కొద్దిగా క్యాబేజి మిశ్రమాన్ని తీసుకుని పకోడీల మాదిరిగా నూనెలో వేయాలి.  క్యాబేజీ పకోడీలు చక్కగా ఎర్రగా అయ్యే వరకు నూనెలో వేయించి తీసేయండి. కొద్దిగా నూనెలో కరి వేపాకు కూడా వేడి వేపి పకోడీలలో వేస్తే వాసన బాగుంటుంది. చారుగాని పప్పు చారు గాని పెట్టుకున్నప్పుడు ఈ క్యాబేజి పకోడీ ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఒక సారి ట్రై చేసి చూడండి 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: