ఇవి పాటిస్తే గ్యాస్ ఆదా అవుతుంది..?

MOHAN BABU
నిత్యావసర సరుకులు, పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు  గ్యాస్ ధరలు కూడా ఆకాశాన్నంటాయి. దీంతో సామాన్య ప్రజలు గ్యాస్ పేరు వింటేనే  హడలెత్తి పోతున్నారు. దీంతో
కొంతమంది  గ్యాస్ ను  ఎక్కువగా ఆదా చేయాలనుకుంటున్నారు. అలాంటి వారు  ఈ  సూత్రాలు పాటించండి. గ్యాస్ ధరలు పెరిగిపోతునందున అది ఆదా చేసే బాధ్యత మహిళలకే కాకుండా  కుటుంబ సభ్యులందరూ తీసుకోవాలి. అప్పుడే గ్యాస్ ఆదా చేసుకోగలుగుతారు. ఇంట్లో  వంట గ్యాస్ ఆదా చేసుకునేందుకు ఈ చిట్కాలను పాటించండి.
 ఏదైనా పప్పు చేసేటప్పుడు నేరుగా చేయకూడదు. అది ఏ పప్పు అయినా సరే కనీసం అరగంట పాటు  నీటిలో నాన బెట్టాలి. ఆ తర్వాతనే  కూరగా వండుకోవాలి. ఇలా చేయడం వల్ల  పప్పు తొందరగా ఉడికి గ్యాస్ కూడా ఆదా అవుతుంది. ఈ చిట్కా పాటించకపోతే   పప్పు ఉడికెందుకు   ఎక్కువ సమయం పట్టి గ్యాస్ ఎక్కువగా ఖర్చవుతుంది.
 అలాగే ఏదైనా కూర చేసేటప్పుడు దానికి అవసరమైన పదార్థాలు అన్నీ ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి. అన్నింటిని తీసి  పక్కన కూడా పెట్టుకోవాలి. అంతేకాకుండా  టమాటా ఒకసారి, పచ్చిమిర్చి ఒకసారి తీసుకురాకూడదు. ఇలా చేయడం వల్ల  మనకు తెలియకుండానే సమయం వృధా అవుతుంది. గ్యాస్ కూడా ఎక్కువ ఖర్చవుతుంది. అందుకే ఏదైనా  వంట చేసే ముందు దానికి అవసరమయ్యే పదార్థాలన్నీ ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది. అలాగే కూరలను గిన్నె, ఫ్యాన్, కడాయిలో కాకుండా ప్రెషర్ కుక్కర్ ఉపయోగిస్తే చాలా మంచిది. ఈ కుక్కర్ లో వండటం వలన తక్కువ సమయంలో కూర ఉడుకుతుంది. దీంతో గ్యాస్ కూడా ఆదా అవుతుంది.

అలాగే ఏదైనా వంటకం పొయ్యిపై ఉడుకుతున్న సమయంలో మధ్య మధ్యలో నీళ్లు పోయడం చాలా మంది చేస్తు ఉంటారు. కానీ అలా చేయరాదు. ఎందుకంటే నీరు పోయడం వలన కూరగాయలు ఉడికెందుకు ఎక్కువ సమయం పట్టవచ్చు. దీని వల్ల కూడా గ్యాస్ ఎక్కువ ఖర్చవుతుంది. కొంతమంది కూర ఎంతవరకు ఉడికింది అని తెలుసుకోవడానికి పదేపదే మూత తీస్తుంటారు. మీరు ఏదైనా వంట చేసేటప్పుడు  తప్పనిసరిగా మూత ఉండేలా చూసుకోవాలి. దాన్ని పదేపదే తియరాదు. దీని వల్ల కూడా గ్యాస్ ఎక్కువ ఆదా అవుతుంది. వంట త్వరగా కావాలని  చాలామంది  ఎక్కువ మంట పెట్టి ఉడికిస్తారు. దీనివల్ల ఇప్పుడు గ్యాస్ వృధా అవుతుంది తప్ప, వంటకం తొందరగా కాదు. తక్కువ మంటతోనే  వంట చేసుకుంటే గ్యాస్ ఆదా అవుతుంది. అలాగే కూరగాయల నేరుగా ఫ్రిజ్ నుంచి  తీసుకొచ్చి  ఉండకూడదు. అది గది ఉష్ణోగ్రతకు చేరుకున్న తర్వాతనే  వంట చేస్తే తొందరగా ఉడికి  గ్యాస్ తక్కువ ఖర్చు అవుతుంది. ఈ విధంగా చిట్కాలు పాటిస్తే ఎక్కువ రోజులు గ్యాస్ మన్నిక అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: