పల్లీలతో ఇలా ఎప్పుడన్నా ట్రై చేసారా...?

Suma Kallamadi
మీకు సమయం లేనప్పుడు, కూర వండలేని పరిస్థితులలో ఇలా పల్లీలతో రైస్ చేసి చూడండి.చాలా బాగుంటుంది. పిలల్లకు, పెద్దలకు బాక్స్ లోకూడా పెట్టి పంపవచ్చు. చాలా రుచికరంగా ఉంటుంది. ఈ రైస్ వండితే ఇంకా కూరతో పని ఉండదు. మరి పల్లీలతో రైస్ ఎలా తయారు చేయాలి అని అనుకుంటున్నారా. అయితే ఇండియా హెరాల్డ్ వారు చెప్పే టిప్స్ పాటిస్తూ,పల్లీల రైస్ ఎలా తయారుచేయాలో చూడండి.. ఇందుకోసం కావాల్సిన పదార్ధాలు ఏంటో ఒకసారి చూడండి.
కావలిసిన పదార్ధాలు :
1/4 cup వేరుసెనగపప్పు
1/4 cup నువ్వులు
4 ఎండు మిర్చి
1/4 cup పచ్చి కొబ్బరి
1 cup ఉడికిన్చుకున్న అన్నం
ఉప్పు
ఉల్లిపాయ -ఒకటి
1/4 cup నూనె
1/2 tsp ఆవాలు
1 tsp మినపప్పు
1 tsp సెనగపప్పు
2 రెబ్బలు కరివేపాకు
కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్
తయారీ విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో వేరుసెనగపప్పు వేసి తక్కువ మంట  3-4 నిమిషాలు పాటు వేయించండి. అవి వేగాక ఒక గిన్నెలోకి తీసుకోండి. ఆ తరువాత అదే బాండీలో ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి, నువ్వులు ఒక్కొటిగా వేసుకుంటూ మంచి వాసన వచ్చే వరకు వేపుకోవాలి. అవి చల్లారిన తరువాత  మిక్సీ లో వేసి పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా చేయకండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మరో పాన్ పెట్టి  నూనె వేడి చేసి తాలింపు దినుసులు వేసి వేయించుకోవాలి. తరువాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి  తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. అవి వేగిన తరువాత ఉడికించిన అన్నం వేయండి. అన్నం పలుకుగా ఉండాలి. లేదంటే తిప్పే తప్పుడు ముక్కలు ముక్కలుగా అయిపోతుంది.. అన్నంలో కొద్దిగా ఉప్పు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుసెనగపప్పు పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిముషాలు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి.లాస్ట్ లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి.అంతే చాలా తక్కువ సమయంలో సులువుగా ఈ పల్లి రైస్ తయారు చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: