రుచికరమైన పనీర్ బన్స్ ఎలా చెయ్యాలో తెలుసుకోండి.....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... పనీర్ ఎంత రుచికరమైన వంటకమో అందరికి తెలిసిందే. దీనిని కూరలో వండుకొని తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇక పనీర్ తో మనం ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. ఇక పిల్లల కోసం అలాగే పెద్దల కోసం రుచికరమైన పనీర్ బన్స్ ఎలా చెయ్యాలో తెలుసుకోండి. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.

పనీర్‌ టేస్టీ బన్స్‌ తయారు చెయ్యడానికి
కావలసిన పదార్ధాలు...


గోధుమ పిండి – 2 కప్పులు,
పంచదార – 2 టేబుల్‌ స్పూన్లు,
నీళ్లు – సరిపడా,
ఉల్లిపాయ – 1(చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి),
బంగాళదుంప – 1 (మెత్తగా ఉడికించుకుని, ముక్కలు చేసుకోవాలి),
పనీర్‌ తురుము – పావు కప్పు,
కారం – అర టీ స్పూన్‌,
కొత్తిమీర తరుగు – 1 టీ స్పూన్‌,
జీలకర్ర పొడి – అర టీ స్పూన్‌,
ఆమ్‌ చూర్‌ – అర టీ స్పూన్‌,
ఉప్పు – తగినంత,
నూనె – సరిపడా,
నువ్వులు – కొద్దిగా...


రుచికరమైన పనీర్ బన్స్ తయారు చేయు విధానం...


ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో గోధుమ పిండి, 2 టేబుల్‌ స్పూన్ల నూనె, పంచదార, కొద్దిగా ఉప్పు.. వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ చపాతీ ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్‌ ఆన్‌ చేసుకుని.. పాన్‌ పెట్టుకుని.. 1 టేబుల్‌ స్పూన్‌ నూనెలో ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, పనీర్‌ తురుము, కారం, కొత్తిమీర తరుగు, జీలకర్ర పొడి, ఆమ్‌ చూర్‌ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. గరిటెతో తిప్పుతూ.. బాగా వేయించాలి. అనంతరం గోధుమ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని.. అందులో బంగాళదుంప, పనీర్‌ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా మధ్యలో పెట్టుకుని.. బాల్స్‌లా చేసుకుని, పైన నువ్వులు పెట్టుకుని.. నూనెలో దోరగా వేయించాలి లేదా.. ఓవెన్‌లో ఉడికించుకోవచ్చు.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: