పచ్చి బఠాణీ మసాలా కూర ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. పచ్చి బఠాణీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది జీర్ణ శక్తిని మెరుగు పరుస్తుంది. ఇందులో వుండే పోషకాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇక పచ్చి బఠాణీ వంటకాలకు రుచి, వన్నె తీసుకు వస్తుంది.ఇది చూడ్డానికి కంటికీ ఇంపుగా కూడా ఉంటుంది.ఇది ఏ కూరలోనైనా ఎందులోనైనా ఊరకనే ఇట్టే కలిసిసోతుంది.ఇక పచ్చి బఠాణీతో రుచికరమైన మసాలా కూరను తయారు చేసుకోవచ్చు. ఇక రుచికరమైన మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. మీరు ఇంట్లో ట్రై చెయ్యండి....

పచ్చి బఠాణీ మసాలా కర్రీ తయారు చెయ్యడానికి కావలసిన పదార్ధాలు....


బఠాణీ - ఒకటిన్నర కప్పులు,
నూనె - తగినంత;
జీలకర్ర - టీ స్పూను;
ఇంగువ - పావు టీ స్పూను;
ఉల్లి తరుగు - పావు కప్పు;
పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను;
టొమాటో తరుగు - అర కప్పు;
పసుపు - పావు టీ స్పూను;
ఉప్పు - తగినంత;
మిరప కారం - టీ స్పూను;
ధనియాల పొడి - టీ స్పూను


పచ్చి బఠాణీ మసాలా కూర తయారు చేయు విధానం ఎలాగో తెలుసుకోండి...


ముందుగా  స్టౌ మీద ప్రెజర్‌ పాన్‌లో నూనె వేడయ్యాక జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. పచ్చి మిర్చి తరుగు జత చేసి మరోమారు వేయించాలి. టొమాటో తరుగు జత చేసి ముక్కలు మెత్తబడే వరకు బాగా కలియబెట్టాలి. పసుపు, ఉప్పు, మిరప కారం, ధనియాల పొడి జత చేసి ఐదు నిమిషాలు బాగా కలుపుతూ ఉడికించాలి. ఒక కప్పు నీళ్లు జత చేయాలి. బఠాణీలు జత చేసి మరోమారు కలిపి మూత ఉంచి నాలుగు విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించి, దింపేయాలి. కొత్తిమీరతో అలంకరించాలి. చపాతీ, పూరీ, అన్నంలోకి రుచిగా ఉంటుంది.ఇంకెందుకు ఆలస్యం ఈ రుచికరమైన పచ్చి బఠాణీ మసాలా కూరని మీరు ఇంట్లో తయారు చెయ్యండి....ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: