ఆరోగ్యకరమైన అంబలి ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. మన భారతీయ వంటకాల్లో అత్యంత ఆరోగ్యకరమైన వంటకాలలో ముందుగా చెప్పుకోవాల్సిన వంటకం అంబలి.దీన్ని రాగులతో తయారు చేస్తారు. పూర్వ కాలంలో మన పెద్ద వాళ్ళు ఈ ఆహారాన్నే తీసుకొని ఎక్కువ కాలం ఎంతో ఆరోగ్యంగా పుష్టిగా బ్రతికారు. అలాంటి హెల్తీ పోషకాలు ఈ వంటకంలో వున్నాయి.ఇది చిన్న పిల్లలకు చిన్న వయసు నుంచి అలవాటు చేస్తే వారు ఎంతో ఆరోగ్యంగా ఇంకా చాలా పుష్టిగా ఉంటారు. కాబట్టి ఈ ఆరోగ్యకరమైన అంబలి ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి...


కావాల్సిన పదార్థాలు....

బియ్యప్పిండి - మూడు స్పూనులు, సజ్జ పిండి - మూడు స్పూనులు, జొన్న పిండి - మూడు స్పూనులు, రాగిపిండి - ఒక కప్పు, ఉప్పు - సరిపడినంత, నీళ్లు - తగినన్నీ.

అంబలి తయారుచేసే విధానం....ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి.. రాగిపిండి కలిపి ఉండల్లేకుండా గిలక్కొట్టాలి. అందులోనే బియ్యప్పిండి, సజ్జపిండి, జొన్నపిండి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టి మూడు గ్లాసుల నీళ్లు పోయాలి. అవి బాగా వేడెక్కాక ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని అందులో వేయాలి. ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి. చిన్న మంట మీద ఉడకనివ్వాలి. కాస్త చిక్కగా మారాక స్టవ్ కట్టేయాలి. దీనికి వేసవి కాలంలో రోజుకు రెండు సార్లు తింటే చాలా మంచిది. అందులో కాస్త మజ్జిగ కలుపుకుని తాగితే ఇంకా బాగుంటుంది.ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక ఈ ఆరోగ్యకరమైన అంబలిని మీరు ట్రై చెయ్యండి. ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వంటకాల గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: