శరీరం వేడి తగ్గడానికి పానకం ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. మాములుగా పానకం అంటే అందరికి గుర్తొచ్చేది శివ రాత్రి పండుగ. శివరాత్రి పండుగ అందరు దేవునికి పూజ చేసిన తరువాత పానకం తాగుతారు. ఈ పానకం రుచికే కాదు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సరైన పద్ధతిలో ఒక క్రమంగా పానకాన్ని తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక ఆ రుచికరమైన ఇంకా ఆరోగ్యకరమైన పానకం ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి....

పానకానికి  కావాల్సిన పదార్థాలు....

బెల్లం తరుగు - అర కప్పు, నల్లమిరియాల పొడి - కొద్దిగా, యాలకుల పొడి - అర టీస్పూన్‌, నీళ్లు - రెండు కప్పులు, శొంఠి - చిటికెడు, నిమ్మరసం - రెండు టీ స్పూనులు, ఉప్పు - తగినంత, తులసి ఆకులు - కొన్ని .

పానకం తయారు చేయువిధానం....

ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి తరిగిన బెల్లం వేయాలి. బెల్లం బాగా కరిగేవరకు అలా వదిలేయాలి. పూర్తిగా కరిగిపోయాక... నీటిని వడకట్టాలి. వడకట్టిన నీళ్లలో నిమ్మరసం, నల్లమిరియాల పొడి, శొంఠిపొడి, యాలకుల పొడి, ఉప్పు వేసి కలపాలి. తులసి ఆకులు కడిగేసి అందులో వేసి ఫ్రిజ్ లో పెట్టాలి. చల్లగా అయ్యాక రోజులో రెండు మూడు సార్లు తాగితే శరీరంలో వేడి అంతా తగ్గిపోతుంది. ఇక ఇలాంటి మరెన్నో వంటకాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: