రుచికరమైన క్యారెట్ కేక్ ఎలా చెయ్యాలో తెలుసుకోండి....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. క్యారెట్ లో ఏ విటమిన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.కేక్స్ అంటే అందరికి చాలా ఇష్టం..క్యారెట్ తో కేక్స్ తయారు చేసుకుంటే అవి ఆరోగ్యానికి చాలా మంచివి. మరి ఈ ఆరోగ్యవంతమైన క్యారెట్ కేక్స్ ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి....
క్యారెట్ కేక్స్ తయారీకి కావాల్సిన పదార్ధాలు ......
క్యారెట్  తురుము - ఒక కప్పు, మైదా - అరకప్పు, పంచదార పొడి - కప్పు, గుడ్లు - రెండు, జీడిపప్పు - పది, బేకింగ్ పౌడర్ - ఒక టీస్పూను, బేకింగ్ సోడా - అరటీస్పూను, యాలకులు - రెండు, దాల్చిన చెక్క పొడి - చిటికెడు, నూనె - సరిపడినంత, ఉప్పు - అరటీస్పూను
క్యారెట్ కేక్స్ తయారు చేయు విధానం....
ఒక గిన్నెలో గుడ్లను పగుల గొట్టి బాగా గిలక్కొట్టాలి. అందులో మైదా, బేకింగ్ పౌడర్, ఉప్పు, పంచదార పొడి, దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి వేసి బాగా గిలక్కొట్టాలి. జీడిపప్పును చిన్నగా తురుముకుని వాటిని కూడా వేయాలి. చివర్లో క్యారెట్ తురుము కూడా వేసి బాగా గిలక్కొట్టాలి. ఇప్పుడు ఓవెన్ 180 డిగ్రీలకు ప్రీ హీట్ చేసి పెట్టాలి. కేక్ ట్రే అడుగుభాగాన కాస్త వెన్న రాసి మైదా చల్లాలి. అందులో క్యారెట్ తరుము మిశ్రమాన్ని వేయాలి. ఆ ట్రేను ఓవెన్ అరగంట పాటూ ఉంచాలి. అనంతరం బయటకు తీసి చల్లారేవరకు వదిలేయాలి. చల్లారాక ఆ క్యారెట్ కేకును ముక్కలుగా కోసి సర్వ్ చేయాలి.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: