రుచికరమైన ఖర్జూరం ఉండలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..  మనం అనేక రకాల తిను బండారాలు తింటూ ఉంటాము... ఖర్జూరాలు ఆరోగ్యానికి చాలా మంచివి. అవి తింటే మంచి బలంగా పుష్టిగా ఉంటారు. ఖర్జూర ఉండలు తయారు చెయ్యటం చాలా సులభం... ఈ ఖర్జుర ఉండలు తింటే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని ఒక అధ్యయనంలో వెళ్లడయింది. ఇక రుచికరమైన ఖర్జూర ఉండలు ఎలా చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. మీరు ఇంట్లో ట్రై చెయ్యండి...

ఖర్జూరం ఉండలు తయారీకి కావాల్సిన పదార్ధాలు...
ఖర్జూరాలు - 20, బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్ నట్స్ - ఇవన్నీ కలిపి అరకప్పు, పచ్చి కొబ్బరి కోరు - రెండు టీస్పూనులు

ఖర్జూరం ఉండలు తయారు చేసే విధానం...
ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి జీడిపప్పు, పిస్తా, బాదం, వాల్ నట్స్ వేయించి దించాలి. నూనె వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే కళాయిలో ఖర్జూరాలను వేయించాలి. అలా వేయిస్తూ ఉండే ఖర్చూరాలు కాస్త మెత్తగా అవుతాయి. వాటిపై కొబ్బరి కోరు చల్లి ఓసారి ఇటూ అటూ వేయించి దించేయాలి. అవి చల్లారాక... బ్లెండర్లో వేసి తిప్పాలి. అలాగే ముందుగా వేయించిన నట్స్ కూడా వేసి బ్లెండ్ చేయాలి. ఆ మిశ్రమం మొత్తాన్ని ఓ గిన్నెలోకి తీసుకుని... కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకోవాలి. వాటిని కొబ్బరి పొడిలో దొర్లించి తింటే చాలా టేస్టుగా ఉంటాయి.ఇంకెందుకు ఆలస్యం మీరు ఇంట్లో ఈ ఖర్జూరం ఉండలు తయారు చెయ్యండి...ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వంటకాలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: