నోరూరించే పాయసం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ కుకింగ్ ఆర్టికల్ చదవండి.. పాయసం మన భారతదేశ సాంప్రదాయ వంటకం. పాయసం అంటే ఇష్టపడని వారు ఎవరూ వుండరు. అది సంపూర్ణ ఆహారం. ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్న పిల్లలు పాయసం అలవాటు చేసుకుంటే చాలా పుష్టిగా అవుతారు.ఎన్నో రకాల పాయసాల గురించి మనకి తెలుసుకు. ఇలాంటి వాటిల్లో ఇప్పుడు మరో కొత్త రెసిపీ గురించి తెలుసుకుందాం. అదే రస్క్ ఖీర్. రస్క్‌ అంటే చాలా మంది ఇష్టపడతారు. వీటితోనే పాయసం చేసుకుంటే బావుంటుంది కదా.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
 
రస్క్ పాయసం తయారీకి కావాల్సిన పదార్ధాలు...
 ప్రధాన పదార్థం....
4 రస్క్....
1 కప్ పాలు.....
ప్రధాన వంటకానికి.....
అవసరాన్ని బట్టి పొడిగా చేసిన యాలకులు.....
అవసరాన్ని బట్టి కోయబడినవి జీడిపప్పు......
అవసరాన్ని బట్టి ఎండు ద్రాక్ష......
1 టేబుల్ స్పూన్ నెయ్యి.....
4 టీ స్పూన్ చక్కర......
రస్క్ పాయసం తయారు చేసే విధానం......
ముందుగా రస్క్‌లను తీసుకుని మిక్సీజార్‌లో వేసి పొడి చేయండి. ఆ తర్వాత ఓ పాన్ తీసుకుని అందులో నెయ్యి వేసి చిన్న మంటపై వేడిచేయండి. నెయ్యి వేడి కాగానే జీడిపప్పులు, ఎండుద్రాక్షలు వేసి వేయించండి.
ఓ 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత క్రష్ చేసిన రస్క్‌ని వేసి వేయించాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేయించండి. ఆ తర్వాత అందులో పాలు వేయండి. అనంతరం ఉండలు లేకుండా బాగా కలపండి..
ఇప్పుడు మిశ్రమం కొద్దిగా చిక్కబడిన తర్వాత పంచదార వేసి బాగా కలపాలి. ఇప్పుడు మిశ్రమం పాయసంలా ఇలా తయారవుతుంది.
ఇప్పుడు అందులో యాలకుల పొడి వేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించండి.
ఇలా తయారైన పాయసాన్ని సర్వింగ్‌ బౌల్‌లోకి తీసుకోండి. ఆ తర్వాత పై నుంచి డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేయండి. ఇలా తయారైన వేడివేడిగా సర్వ్ చేయండి.
ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాలు గురించి తెలుసుకోవడానికి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: