పచ్చి మిర్చీ కోడి పులావ్... చాలా సింపుల్
తయారి ఏ విధంగా అంటే... బియ్యాన్ని కడిగి, నీళ్లలో నాన పెట్టండి. చికెన్ లో ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, పసుపు, పెరుగు, పుదీనా ఆకులు వేసి బాగా కలిపి పక్కన పెట్టండి. ఆ తర్వాత పాన్ పెట్టి మసాలా దినుసులు అన్నీ వేసి వేయించి పక్కన పెట్టండి. అవి చల్లారిన తర్వాత పొడి చేసి కొబ్బరి తురుమును విడిగా గ్రైండ్ చేసి పేస్ట్ లా పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత పులావ్ కోసం గానూ పొయ్యి మీద ఒక మందం గిన్నె పెట్టి అది వేడి అయిన తర్వాత నూనె వేయండి. ఆ వేడి నూనెలో సాజీర, ఉల్లిపాయలు వేసి వేయించండి. అందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేయండి.
అప్పుడు పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, కట్ చేసిన మిర్చి, కరివేపాకు వేసి మూడు నిమిషాలు వేయించండి. కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసి మరో 5 నిమిషాలు ఉడికించండి. మసాలా కలిపిన చికెన్ ను వేసి, పది నిమిషాలు ఉడకనివ్వండి. అప్పుడు నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి కలపండి. ఆ తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి, పైన మూత పెట్టి, మిశ్రమం అంతా ఉడకనిచ్చి అన్నం పూర్తిగా ఉడికేంతవరకు ఉంచి, మూత తీసి పైన వేయించిన జీడి పప్పు పలుకులు, కొత్తిమీర ఆకులు చల్లి సన్నని మంట మీద కొంచెం సేపు ఉంచి దించుకోండి.