మటన్ కీమా బాల్స్ ఎలా అంటే...!
మటన్ కీమా – అర కేజీ, బిర్యానీ పువ్వు - కొద్దిగా, మిరియాలు – టీ స్పూన్ కావాలి. యాలకులు – నాలుగైదు చాలు. ధనియాలు - టేబుల్ స్పూన్, జీలకర్ర – టీ స్పూన్, దాల్చిన చెక్క - కొద్దిగా, తోక మిరియాలు - అర టీస్పూన్, కావాలి. లవంగాలు - ఐదారు, ఎండు మిర్చి - పది, నూనె – సరిపడా వేయండి. ఉప్పు రుచికి తగినంత వేసుకోండి. బ్రౌన్ ఆనియన్స్ - అర కప్పు చాలు. కొత్తిమీర, పుదీనా - కొద్దిగా, సెనగ పప్పు - టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి - టేబుల్ స్పూన్, కోడి గుడ్డు – ఒకటి చాలు.
మటన్ కీమాను శుభ్రంగా కడిగిన తర్వాత సెనగపప్పు నానబెట్టాలన్నమాట. ముందుగానే ఇందుకు గానూ మసాలా సిద్ధం చేసుకోవాలసి ఉంటుంది. స్టవ్ పై పాన్ పెట్టి కాస్త వేడి అయ్యాక మిరియాలు, యాలకులు, ధనియాలు, జీలకర్ర, తోక మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ పువ్వు, ఎండు మిర్చి వేసి వేయించండి. అలాగే వీటితో పాటు బ్రౌన్ ఆనియన్స్ మిక్సీలో వేసి మసాలా పొడి తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, నానబెట్టిన సెనగ పప్పు వేయండి. చివరగా కీమా వేసి, కోడిగుడ్డు కొట్టి వేయండి. తగినంత ఉప్పు వేసి మరొకసారి మిక్సీ పట్టేసి... ఈ మిశ్రమాన్ని ప్లేటులోకి తీసుకుని మసాలాలు బాగా కలుపుకుని... బాగా కలిసేలా కలపండి. స్టవ్ పై మరొక పాత్ర పెట్టి నూనె పోసి, ఈ మిశ్ర మాన్ని కొద్ది కొద్దిగా బాల్స్‌లా చేసుకుంటూ నూనెలో డీప్ ఫ్రై చేస్తే మటన్ కీమా బాల్స్ రెడీ అయిపోయినట్టే.