వంటా వార్పు: య‌మ్మీ య‌మ్మీ `గోధుమ సున్నుండలు` మీ కోసం..!!

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు:
గోధుమపిండి - ఒక కప్పు
బెల్లం తురుము - ఒక కప్పు
నెయ్యి- అరకప్పు

 

పంచ‌దార పౌవ‌ర్‌- రెండు టీ స్పూన్లు
జీడిప‌ప్పు- ప‌ది నుంచి ప‌దిహేను
బాదం ప‌ప్పు- ప‌ది

 

త‌యారీ విధానం:
ముందుగా స్టవ్ అన్ చేసి పాన్ పెట్టి చిన్న మంట పెట్టాలి. ఇప్పుడు అందులో గోధుమ పిండి వేసి కాసేపు వేయించాలి. ముదురు బూడిద రంగుకు వచ్చేవరకు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేయాలి. పిండి చల్లారాక అందులో బెల్లం తురుము, పంచ‌దార పౌడ‌ర్ క‌లిపి.. ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.  

ఇప్పుడు ఆ మిశ్రమాన్ని తీసి ఒక గిన్నెలో వేసి కాస్త గోరువెచ్చగా వేడి చేసిన నెయ్యిని వేసి బాగా కలపాలి. ఆ త‌ర్వాత ఇందులో బాదం ముక్క‌లు, జీడిప‌ప్పు ముక్క‌లు వేసి క‌లుపుకోవాలి. అనంతరం ఉండలు చుట్టుకోవాలి. ఇప్పుడు గాలి చొరబడని డబ్బాల్లో దాస్తే అయిదు రోజుల వరకు తాజాగా ఉంటాయి. అంతే య‌మ్మీ య‌మ్మీ గోధుమ సున్నుండలు రెడీ.

సాయంత్రం టైమ్‌లో వీటిని తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి. కాబ‌ట్టి ఈ టేస్టీ గోధుమ సున్నుండలను మీరు కూడా త‌యారుచేసుకుని ఎంజాయ్ చేయండి. కాగా, గోధుమలు.. విశ్వవ్యాప్తంగా మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నాయి. దీనిలోని తక్కువ కొవ్వు పదార్ధం కారణంగా గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది డయాబెటిక్  రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది.

అలాగే గోధుమలను తీసుకోవడం వలన ఈస్ట్రోజన్ ఉత్పత్తి యొక్క జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇది బ్యాక్టీరియల్ ఎంజైములను తగ్గిస్తాయి. తద్వారా పెద్దప్రేగు క్యాన్సర్ అవకాశాలు తగ్గిపోతాయి. కాబ‌ట్టి, గోధుమల‌తో త‌యారు చేసిన సున్నుండలు త‌యారు చేసుకోండి.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: